భారీ ఆఫర్ …ఇద్దరు ఓకే.. మరో ఇద్దరు నాట్ ఒకే..!

‘బిగ్ బాస్’ రియాలిటీ షోకి తెలుగులో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. ఇందులో ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ల వల్లనో.. లేక ‘బిగ్ బాస్’ ఇచ్చే టాస్క్ ల వల్లనో.. అదీకాక కంటెస్టెంట్ ల మధ్య జరిగే గొడవల వల్లనో కానీ.. ప్రేక్షకులు ఈ రియాలిటీ షోకి బాగా అట్రాక్ట్ అయ్యారు.ఇప్పటికే మూడు సీజన్లు ముగిసాయి. మొదటి సీజన్ ను ఎన్టీఆర్, రెండో సీజన్ ను నాని, మూడవ సీజన్ ను నాగార్జున వంటి హీరోలు హోస్ట్ చేసి సూపర్ హిట్లుగా నిలబెట్టారు.

త్వరలో 4వ సీజన్ మొదలుకానుంది. ఈపాటికే మొదలు కావాలి కానీ.. లాక్ డౌన్ నిబందనల కారణంగా లేట్ అవుతున్నట్టు వినికిడి. ఇక 4 వ సీజన్ ను కూడా నాగార్జునే హోస్ట్ చేస్తారని టాక్ బలంగా వినిపిస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ సీజన్ కోసం నలుగురు యంగ్ హీరోలను సంప్రదించారట ‘బిగ్ బాస్’ నిర్వాహకులు. వారికి భారీగా పారితోషికం కూడా ఇస్తాము అని ఆఫర్ చేసారట. కానీ అందులో ఇద్దరు రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

రిజెక్ట్ చేసిన యంగ్ హీరోలు ‘ఆర్.ఎక్స్.100’ ఫేమ్ కార్తికేయ మరియు ‘గుంటూరు టాకీస్’& ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఫేం సిద్దు జొన్నలగడ్డ అని తెలుస్తుంది. ఇక ఈ ఆఫర్ కు ఓకే చెప్పిన యంగ్ హీరోలు ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్’ ఫేమ్ సుధాకర్ మరియ ‘గరుడ వేగా’ ఫేమ్ అదితి అరుణ్ అని సమాచారం.ఈసారి ‘బిగ్ బాస్’ కేవలం 50 రోజులు మాత్రమే జరుగుతుంది అనే టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. మరి అది ఎంత వరకూ నిజమో తెలియాల్సి ఉంది.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus