ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకు ఇన్‌స్టాగ్రామ్ లో సూపర్ క్రేజ్.. అంతే..!

పెద్ద హీరోలైనా.. చిన్న హీరోలైనా ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇండియాలో జరిగే ఏ విషయం పై అయినా సరే తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. కేవలం తమ సినిమాల అప్డేట్ ల కోసం లేదా వాటి ప్రమోషన్ల కోసం మాత్రమే కాకుండా సామాజిక అంశాల పై కూడా స్పందించి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక పక్క హీరోలకు,దర్శకులకు,నిర్మాతలకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంలోనూ.. అలాగే వారి ఫ్యామిలీస్ తో గడిపే ఫోటోలను షేర్ చెయ్యడం వంటివి కూడా మన హీరోలు చేస్తుంటారు. అలా ప్రేక్షకులతో ఎప్పుడూ కనెక్ట్ అయ్యే ఉంటున్నారు మన టాలీవుడ్ హీరోలు.అందుకే వీళ్లకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య కూడా మిలియన్లలో ఉంటుంది.

ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్.. ఈ రోజుల్లో సమాచారాన్ని చేరవేయడంలో చాలా ఫాస్ట్ గా ఉంటుంది.నెట్ సదుపాయం ఉండాలే కానీ ఫోన్ లోనే టక్కున ప్రపంచాన్ని చూపించేస్తుంది. అందుకే చాలా మంది సినిమా హీరోలు ఇన్స్టాగ్రామ్ కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో కూడా మన హీరోలకు ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువే.! మరి ఇన్స్టాగ్రామ్లో అత్యథిక ఫాలోవర్లు కలిగిన 10మంది టాలీవుడ్ హీరోల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :

1) విజయ్ దేవరకొండ: ఈ రౌడీ హీరో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుర్రకారునందరినీ గ్రిప్ లో పెట్టేసుకున్నాడు. టాలీవుడ్లో అత్యధికంగా 12 మిలియన్ ఇన్స్టా ఫాలోవర్స్ ను కలిగిన హీరో ఇతనే.!

2) అల్లు అర్జున్: సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్‌ కు 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

3) మహేష్ బాబు: ట్విట్టర్ తో పోలిస్తే ఇన్స్టా లో మహేష్ బాబుకి ఫాలోవర్స్ తక్కువే..!కానీ.. తీసిపోయేంత తక్కువైతే కాదు. ఇన్స్టాగ్రామ్లో మన సూపర్ స్టార్ కు 6.3 మిలియన్ ఫాలోవర్స్‌ ఉన్నారు.సమయం దిరికినప్పుడల్లా తన కొడుకు, కూతుర్ల ఫోటోలను షేర్ చేస్తుంటాడు మహేష్.

4) ప్రభాస్: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కు ఇన్‌స్టాగ్రామ్‌లో 5.8 మిలియన్ ఫాలోవర్స్‌ ఉన్నారు.నిజానికి ప్రభాస్ సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్ గా ఉండడు. అయినా సరే.. ఈ రేంజ్లో ఫాలోవర్స్ ఉండడం విశేషం అనే చెప్పాలి.

5) రానా: మన భల్లాల దేవుడు రానాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.3 మిలియన్ ఫాలోవర్స్‌ ఉండడం విశేషం.

6) రాంచరణ్: మన మెగా పవర్ స్టార్ కు ఇన్‌స్టాగ్రామ్‌లో 3.3 మిలియన్ ఫాలోవర్స్‌ ఉన్నారు.

7) నాని: నేచురల్ స్టార్ నానికి కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో 3.3 మిలియన్ ఫాలోవర్స్ ఉండడం విశేషం.

8) వరుణ్ తేజ్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

9) ఎన్టీఆర్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కూడా ఇన్స్టాగ్రామ్లో 2.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

10) అఖిల్ అక్కినేని: మన అఖిల్ కు కూడా ఇన్స్టాగ్రామ్లో 2.1 ఫాలోవర్స్ ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus