అతి తక్కువ సమయంలో వన్ మిలియన్ వ్యూస్ సాధించిన ట్రైలర్స్!

ప్రస్తుతం సినిమా విజయంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. థియేటర్లోకంటే ముందుగానే ఇక్కడే టీజర్, ట్రైలర్ రూపంలో సినిమాలపై అభిప్రాయం మొదలవుతోంది. పైగా భారీ ఓపెనింగ్స్ కి ఇక్కడి వ్యూస్ ఆధారమవుతున్నాయి. అందుకే ఇక్కడి రికార్డ్స్ ని కూడా పరిగణలోకి తీసుకోకతప్పడం లేదు. కొంతకాలంగా తెలుగు చిత్రాల ట్రైలర్లు యూట్యూబ్లో హంగామా సృష్టిస్తున్నాయి. అతి తక్కువ సమయంలోనే లక్షల వ్యూస్ అందుకొని ఔరా అనిపిస్తున్నాయి. ఒక మిలియన్ వ్యూస్ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న టాప్ టెన్ తెలుగు సినిమా ట్రైలర్స్..

01 . బాహుబలి కంక్లూజన్

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి బిగినింగ్ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన బాహుబలి కంక్లూజన్ ట్రైలర్ గంట కూడా పూర్తికాకముందే ఒక మిలియన్ వ్యూస్ దక్కించుకొని నంబర్ వన్ స్థానాన్ని అందుకుంది.

02 . దువ్వాడ జగన్నాథం

సరైనోడు మూవీ తర్వాత అల్లు అర్జున్ చేసిన దువ్వాడ జగన్నాథం ట్రైలర్ విడుదలైన ఒకటిన్నర గంటల్లో వన్ మిలియన్ మార్క్ చేసుకొని బన్నీకి ఉన్న క్రేజ్ ని చాటింది.

03 . ఖైదీ నంబర్ 150

మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత నటించిన సినిమా ఖైదీ నంబర్ 150. వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్లో అడుగుపెట్టిన 3.40 గంటల్లో వన్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.

04 . ధృవ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన మూవీ ధృవ. ఐపీఎస్ ఆఫీసర్ గా చెర్రీ నటించిన ధృవ మూవీ ట్రైలర్ 4 :45 గంటల్లో వన్ మిలియన్ వ్యూస్ అందుకుంది.

05 . జై లవకుశ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి త్రి పాత్రాభినయం పోషించిన జై లవకుశ ట్రైలర్ 5 గంటలు పూర్తికాకముందే వన్ మిలియన్ వ్యూస్ మార్క్ చేరుకొని ఐదవ స్థానంలో నిలిచింది.

06 . గౌతమి పుత్ర శాతకర్ణి

నటసింహ బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి 5 గంటల్లో వన్ మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది.

07 . పైసావసూల్

అత్యంత వేగంగా వన్ మిలియన్ వ్యూస్ దక్కించుకున్న టాప్ టెన్ తెలుగు సినిమా ట్రైలర్స్ జాబితాలో బాలయ్య చిత్రాలు రెండు ఉండడం విశేషం. బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన పైసా వసూల్ ట్రైలర్ 8 గంటల్లో వన్ మిలియన్ వ్యూస్ మార్క్ ని చేరుకుంది.

08 . స్పైడర్

మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన స్పైడర్ మూవీ ట్రైలర్ లేటెస్ట్ గా వచ్చినప్పటికీ కొంత ఆలస్యంగా వన్ మిలియన్ వ్యూస్ మార్క్ అందుకుంది. పది గంటల్లో ఈ మైలురాయిని చేరుకుంది.

09 . జయ జానకి నాయక

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక 13 గంటల్లో వన్ మిలియన్ వ్యూస్ సాధించింది. స్టార్ హీరో లేకపోయినప్పటికీ ఈ రికార్డును సొంతం చేసుకోవడం విశేషం.

10 . జనతా గ్యారేజ్

ఎన్టీఆర్ అద్భుతంగా నటించి హిట్ అందుకున్న జనతా గ్యారేజ్ మూవీ ట్రైలర్ 15 గంటల్లో వన్ మిలియన్ వ్యూస్ సాధించి ఎన్టీఆర్ సత్తాని చాటింది. గత ఏడాది ఈ మూవీ ట్రైలర్ తొలి స్థానంలో ఉన్నింది. కొత్త సినిమాలు రావడంతో పదో స్థానానికి పరిమితమయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus