‘దసరా’ టు ‘బింబిసార’..మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన 11 టైర్ 2 హీరోల సినిమాలు!

స్టార్ హీరోలే కాదండోయ్ ‘టైర్ 2’.. అంటే మీడియం రేంజ్ హీరోలు కూడా తమ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. వీళ్ళ సినిమాలు కూడా మొదటి రోజు నాడు మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి.స్టార్ డైరెక్టర్లతో.. అలాగే స్టార్ ప్రొడ్యూసర్లతో సినిమాలు చెయ్యకపోయినా .. మొదటి రోజు వీళ్ళ సినిమాలకి కూడా మంచి కలెక్షన్లు వస్తుండటం అంటే చిన్న విషయం ఏమీ కాదు. ఒకవేళ స్టార్ డైరెక్టర్స్ అలాగే స్టార్ ప్రొడ్యూసర్లతో సినిమాలు చేస్తే .. వీళ్ళ సినిమాలు కూడా స్టార్ హీరోల రేంజ్ కు తగ్గకుండా కలెక్షన్లు సాధిస్తాయి అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు.ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేసి సినీ కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది వీళ్ళే. నాని , విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, నితిన్,.. అబ్బో ఈ లిస్ట్ కొంచెం పెద్దదే. మరి మొదటిరోజు అదీ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన ‘టైర్ 2’ హీరోల సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) దసరా :

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.14.07 కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డు సృష్టించింది.

2) లైగర్ :

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.9.52 కోట్ల షేర్ ను రాబట్టింది.

3) ఇస్మార్ట్ శంకర్ :

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.7.73 కోట్ల షేర్ ను రాబట్టింది.

4) అఖిల్ :

అఖిల్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.7.60 కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డు సృష్టించింది.

5) ఎం.సి.ఏ :

నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 7.57 కోట్ల షేర్ ను రాబట్టింది. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు వంటి స్టార్ ప్రొడ్యూసర్ నిర్మించడం మరియు డిస్ట్రిబ్యూట్ చేయడంతో మంచి వసూళ్లు వచ్చాయి.

6) డియర్ కామ్రేడ్ :

విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.7.50 కోట్ల షేర్ ను రాబట్టింది. భరత్ కమ్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం.. ‘గీత గోవిందం’ పెయిర్ కావడం అందులోనూ ‘మైత్రి మూవీ మేకర్స్’ వంటి పెద్ద సంస్థ నిర్మించడంతో మంచి వసూళ్లు వచ్చాయి.

7)లవ్ స్టోరీ :

నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.7.13 కోట్ల షేర్ ను రాబట్టింది.

8) ది వారియర్ :

రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.6.8 కోట్ల షేర్ ను రాబట్టింది.

9) శైలజారెడ్డి అల్లుడు :

నాగ చైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.6.73 కోట్ల షేర్ ను రాబట్టింది.

10) భీష్మ :

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.6.42 కోట్ల షేర్ ను రాబట్టింది.

11) బింబిసార :

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు రూ.6.01 కోట్ల షేర్ ను రాబట్టింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus