Overseas: ఓవర్సీస్ లో ఆ హీరో సినిమాకు క్రేజ్ మాములుగా లేదుగా..!

టాలీవుడ్ కి అతి పెద్ద మార్కెట్ ఏదైనా ఉందా అంటే అది ఓవర్సీస్ మార్కెట్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. ‘దూకుడు’ సినిమా తో మన తెలుగు సినిమాకి ఓవర్సీస్ లో ఒక రేంజ్ లో మార్కెట్ ఏర్పడింది. టాలీవుడ్ కి మొట్టమొదటి 1 మిలియన్ డాలర్స్ సాధించిన సినిమా అదే. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం 1 మిలియన్ మార్కుని అందుకుంది.

ఈ సినిమా తర్వాత అలా వరుసగా చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా టాక్ వస్తే చాలు 1 మిలియన్ డాలర్లు కొడుతూ వచ్చాయి. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు మరియు ప్రభాస్ వంటి హీరోలకు ఓవర్సీస్ లో (Overseas) ఉన్న మార్కెట్ మామూలుది కాదు. వీళ్ళకే అత్యధిక ప్రీమియర్ రికార్డ్స్ ఉన్నాయి. అయితే ప్రీమియర్స్ కి ముందు సేల్ అయ్యే అడ్వాన్స్ బుకింగ్స్ లో టాప్ 5 స్థానాల్లో ఉన్న సినిమాల లిస్ట్ ఒకసారి తెలుసుకుందాం.

ముందుగా ప్రీ సేల్స్ లో నెంబర్ 1 స్థానం లో నిల్చిన చిత్రం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ చిత్రం. ఈ సినిమా అమెరికా ప్రాంతం లో దాదాపుగా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రెండు మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ ని రాబట్టింది. ఆ తర్వాత రెండవ స్థానం లో కూడా రాజమౌళి సినిమానే ఉంది. ఆయన దర్శకత్వం లో వచ్చిన బాహుబలి సినిమా , ప్రీమియర్ షోస్ ప్రీ సేల్స్ దాదాపుగా 14 లక్షల డాలర్ల వరకు ఉంటుంది.

ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రం 1 మిలియన్ డాలర్ ప్రీ సేల్స్ తో టాప్ 3 స్థానం లో నిలవగా, చిరంజీవి ఖైదీ నెంబర్ 150 మరియు బాహుబలి పార్ట్ 1 సినిమాలు 8 లక్షల డాలర్ల వసూళ్లు ప్రీ సేల్స్ లో సాధించి టాప్ 4 స్థానం లో నిల్చింది. ఇక ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన స్పైడర్ చిత్రం 7 లక్షల డాలర్స్ తో టాప్ 5 స్థానం లో నిల్చింది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus