Balakrishna, Vijay: బాలయ్య వర్సెస్ విజయ్.. బాలయ్య ఆ ఘనతను సొంతం చేసుకుంటారా?

  • July 22, 2023 / 09:43 PM IST

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి, విజయ్ వారసుడు సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. అయితే సంక్రాంతికి పోటీ పడిన బాలయ్య, విజయ్ ఈ ఏడాది దసరా పండుగ సమయంలో కూడా పోటీ పడుతున్నారు. బాలయ్య నటించిన భగవంత్ కేసరి, విజయ్ నటించిన లియో అక్టోబర్ నెల 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానున్నాయి.

భగవంత్ కేసరి సినిమాకు అనిల్ రావిపూడి డైరెక్టర్ కాగా లియో సినిమాకు లోకేశ్ కనగరాజ్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే. బాలయ్య సినిమాకు 80 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బిజినెస్ జరగగా లియో సినిమా తెలుగు రైట్స్ 18.5 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. సితార నిర్మాతలు లియో సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే సితార నిర్మాతల బ్యానర్ లోనే బాలయ్య తర్వాత సినిమా తెరకెక్కుతోంది.

మరోవైపు (Balakrishna) బాలయ్య 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిసుండగా భగవంత్ కేసరి సినిమాతో బాలయ్య ఆ ఘనతను కూడా సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాలయ్య, విజయ్ సినిమాలలో కలెక్షన్ల పరంగా బాలయ్యే పైచేయి సాధిస్తాడనే విషయంలో సందేహం అవసరం లేదు. అయితే టాక్ విషయంలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.

మరోవైపు రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా దసరా కానుకగా రిలీజ్ అవుతుందని ప్రకటన వెలువడినా ఆ సినిమా రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దసరా కానుకగా రిలీజయ్యే సినిమాలకు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది. గురువారం రోజున భగవంత్ కేసరి. లియో సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus