2025 సంక్రాంతికి థియేటర్లు బుకింగ్.. ప్రతి సంక్రాంతికి ఇదే పరిస్థితా?

  • February 3, 2024 / 11:41 AM IST

తెలుగు రాష్ట్రాల్లోని హిందువులకు పెద్ద పండుగలలో సంక్రాంతి ఒకటనే సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నా సినిమా హిట్ కావడం ఖాయమని నిర్మాతలు భావిస్తారు. ఇప్పటికే పలు సినిమాలు ఈ సెంటిమెంట్ నిజమేనని ప్రూవ్ చేశాయి. ఈ ఏడాది సంక్రాంతి సమయంలో జరిగిన థియేటర్ల రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హనుమాన్ సినిమాకు థియేటర్ల విషయంలో జరిగిన అన్యాయం గురించి ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే హనుమాన్ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ రావడం వల్ల క్రమంగా ఈ సినిమాకు థియేటర్లు పెరిగాయి. ఈరోజు కూడా మెజారిటీ థియేటర్లలో హనుమాన్ సినిమాకు 50 శాతం కంటే ఎక్కువగా ఆక్యుపెన్సీ ఉందంటే హనుమాన్ మూవీ రేంజ్ సులువుగా అర్థమవుతుందని చెప్పవచ్చు. అయితే 2025 సంక్రాంతికి విశ్వంభర సినిమాతో పాటు పలు క్రేజీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. విశ్వంభర జనవరి 10న రిలీజ్ కానుండగా దిల్ రాజు నిర్మాతగా ఒక సినిమా అదే సమయానికి ఫిక్స్ అవుతుందని తెలుస్తోంది.

నాగార్జున (Nagarjuna) సైతం తన సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాల కోసం ఇప్పటికే థియేటర్లను రిజర్వ్ చేస్తున్నారట. ఇకపై ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు థియేటర్ల రగడ ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2025 సంక్రాంతి పండుగ సమయంలో ఎక్కువ సినిమాలు విడుదలైతే ఆ సినిమాలకు థియేటర్లను ఎలా కేటాయిస్తారో చూడాల్సి ఉంది.

నైజాం, వైజాగ్ ఏరియాలలో థియేటర్లకు సంబంధించి ఎక్కువగా పోటీ నెలకొందని తెలుస్తోంది. సంక్రాంతి రేసులో రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన సినిమాలకు లాంగ్ రన్ ఉండటం వల్ల కూడా సంక్రాంతి సీజన్ పై దర్శకనిర్మాతలు ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తోంది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus