బ్రేక్ ఈవెన్ కష్టమే మహేష్ గారు..!

మహేష్ బాబు 25 వ చిత్రంగా వచ్చిన ‘మహర్షి’ చిత్రం మొదటి వారం కలెక్షన్లు బయటకి వచ్చాయి. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం గతవారం మే 9 న విడుదలయ్యి డీసెంట్ టాక్ ను సొంతం చేసుకుంది. మహేష్ 25 వ చిత్రం కావడంతో కలెక్షన్లు ఇప్పటివరకూ బాగానే వచ్చాయి. ‘భరత్ అనే నేను’ అంత బ్లాక్ బస్టర్ టాక్ రానప్పటికీ ఈ చిత్రం కలెక్షన్ల విషయంలో ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని మించింది. అయితే ఇది తెలుగు రాష్ట్రాల వరకే. ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు. ఇక ‘మహర్షి’ చిత్రం 11 రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచ వ్యాప్తంగా 85.58 కోట్ల షేర్ ను రాబట్టింది.

ఇక 11 రోజులకి గానూ ‘మహర్షి’ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 24.70 కోట్లు
సీడెడ్ – 8.10 కోట్లు
వైజాగ్ – 8.00 కోట్లు
ఈస్ట్ – 6.20 కోట్లు


వెస్ట్ – 4.91 కోట్లు
కృష్ణా – 4.84 కోట్లు
గుంటూరు – 6.95 కోట్లు
నెల్లూరు – 2.33 కోట్లు
———————————————
ఏపీ + తెలంగాణా – 66.03 కోట్లు
(టోటల్)

రెస్ట్ అఫ్ ఇండియా – 9.80 కోట్లు
ఓవర్సీస్ – 9.75 కోట్లు
———————————————
వరల్డ్ వైడ్ టోటల్ – 85.58 కోట్లు
———————————————

‘మహర్షి’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 95 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి వారం పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ 85.58 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 10 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఈ చిత్రానికి వచ్చిన టాక్ తో అది సాధ్యం అవుతుందా అంటే కష్టమనే చెప్పాలి. ఎందుకంటే 2 వీకెండ్ కలెక్షన్స్ చాలా డ్రాప్ అయ్యాయి. మహేష్ 25 వ చిత్రం కాస్త డీసెంట్ టాక్ రావడం… అందులోనూ సమ్మర్ హాలిడేస్ పక్కన సినిమాలు లేకపోవడం,టికెట్ రేట్లు పెంచడం.. వీటి వలనే ఇప్పటి వరకూ పర్వాలేదని కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక మహేష్ కు పిచ్చ క్రేజ్ ఉన్న ఓవర్సీస్లో ఈ చిత్రం 2 మిలియన్ కూడా రాబట్టలేకపోయింది. అక్కడ కనీకష్టంగా 1.6 మిలియన్ దాటింది. అక్కడ బయ్యర్స్ సేఫ్ అవ్వాలంటే ఈ చిత్రం 2.5 మిలియన్ రాబట్టాల్సి ఉంది. కానీ అది అసాధ్యమని ట్రేడ్ పండితులు తేల్చేసారు. కలెక్షన్స్ పరంగా ఇప్పటి వరకూ మహేష్ సూపర్ హిట్ ‘శ్రీమంతుడు’ ను దాటింది. ఇక 3 వ వారం కూడా ఇదే పెర్ఫార్మన్స్ ఇస్తే ‘భరత్ అనే నేను’ ‘అరవింద సమేత’ ను దాటే అవకాశం ఉంది. అంతే తప్ప ‘రంగస్థలం’ ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రాల కలెక్షన్ల వరకూ వెళ్ళే అవకాశం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus