సినీ పరిశ్రమలో హీరోయిన్ లకి లైఫ్ టైమ్ చాలా తక్కువగా ఉంటుంది అని అంతా అనుకుంటారు. మరోపక్క హీరోయిన్ల కొరత కూడా ఎక్కువగానే ఉంటుంది అని అంటూ ఉంటారు. అందుకే ఒక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా లేదా క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన వాళ్ళకి హీరోయిన్ల అవకాశాలు ఇస్తూ ఉంటారు మేకర్స్. బేబి లో హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ కి చెల్లి పాత్రలో కూడా ఈమె నటించింది.
అలాగే ఇప్పటి వరకు ముక్కు మొహం తెలీని అమ్మాయిలు ఎంతో మంది హీరోయిన్ లు అయ్యారు. అయితే ఒక ట్రాన్స్ జెండర్ కు హీరోయిన్ అవకాశం కల్పించింది కన్నడ చిత్ర పరిశ్రమ. వివరాల్లోకి వెళితే.. గోవాలోని ఓ నైట్ క్లబ్ లో డ్యాన్సర్ గా తన జీవితాన్ని ప్రారంభించిన వైశాలీ అనే ట్రాన్స్ జెండర్ కి ‘మిస్టర్ అండ్ మిసెస్ మన్మథ’ అనే కన్నడ సినిమాలో హీరోయిన్ గా అవకాశం లభించింది.
ఇప్పటి వరకు చాలా మంది ట్రాన్స్ జెండర్ లకి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించే ఛాన్స్ లభించింది. ప్రియాంక సింగ్, తమన్నా.. వంటి వారికి బిగ్ బాస్ రియాల్టీ షోలలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ లభించింది. అలాగే వారి జీవితాల గురించి కూడా కాంచన వంటి సినిమాలు వచ్చాయి. కానీ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకోవడం అనేది వైశాలి గొప్పతనం అనే చెప్పాలి
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!