Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Reviews » Trikala Review in Telugu: త్రికాల సినిమా రివ్యూ & రేటింగ్!

Trikala Review in Telugu: త్రికాల సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 29, 2026 / 01:34 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Trikala Review in Telugu: త్రికాల సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • మాస్టర్ మహేంద్రన్ (Hero)
  • శ్రద్దా దాస్ (Heroine)
  • సాహితీ అవాంచ, ఆమని,శ్రీ సుధా,అజయ్, రవి వర్మ, జీవా,దేవీ ప్రసాద్,రోహిణి,సూర్య, ఈటీవీ ప్రభాకర్ తదితరులు (Cast)
  • మణి తెల్లగూటి (Director)
  • రాధికా శ్రీనివాస్ (Producer)
  • హర్షవర్ధన్ రామేశ్వర్ (Music)
  • పవన్ చెన్న (Cinematography)
  • మణి తెల్లగూటి (Editor)
  • Release Date : 28th మే 2026
  • చాగంటి ప్రొడక్షన్స్ ఎల్ ఎల్ పి (Banner)

పెద్ద సినిమాలు లేకపోవడంతో చిన్న సినిమాలకి, డబ్బింగ్ సినిమాలకి కూడా ఈ వారం స్పేస్ దొరికినట్టు అయ్యింది. అందులో భాగంగా ఈ వారం ‘త్రికాల’ అనే చిన్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘దేవి’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మాస్టర్ మహేంద్రన్ అందరికీ గుర్తుండే ఉంటాడు. తర్వాత ‘మాస్టర్’ లో యంగ్ విజయ్ సేతుపతిగా కూడా చేశాడు. అతను ‘త్రికాల’ సినిమాలో హీరోగా నటించడం విశేషం. అలాగే హీరోయిన్ శ్రద్ధాదాస్, అజయ్, ఆమని వంటి స్టార్స్ కూడా నటించారు. ఇంతమంది స్టార్స్ నటించిన ఈ ‘త్రికాల’ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం రండి:

Trikala Movie Review

Trikala Movie Review and Rating

కథ: అనగనగా ఒక రాజ కుటుంబం. ఆ వంశపు రాజుకి ఎన్ని పూజలు చేసినా సంతానం కలగదు. దీంతో అతని భార్య సుమిత్రా దేవి ‘కాటేరమ్మ’ తల్లికి ముడుపు కట్టి తనకు సంతానం కల్పించాలని వేడుకుంటుంది. కానీ అదే సమయంలో, కొందరు స్వార్థపరులు ‘గోవధ చేస్తే సంతానం కలుగుతుంది’ అని రాజుని పక్కదోవ పట్టిస్తారు. సుమిత్రాదేవి ఆ ఘోరాన్ని ఆపాలని ప్రయత్నించినా లాభం లేకపోతుంది. రాజు చేసిన ఆ పాపానికి గాను, ఆ వంశానికి ఒక భయంకరమైన శాపం తగులుతుంది. అదేంటంటే.. ఆ వంశంలో పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో జన్మించడం.దాని వల్లే సూర్య వర్ధన్ వర్మ (దేవి ప్రసాద్) నడవలేని స్థితిలో జన్మిస్తాడు. అతనికి పెళ్ళైన తర్వాత బిడ్డ వైతరణ్ (అజయ్) జన్మనిచ్చి అతని భార్య మరణిస్తుంది.దీంతో సూర్య వర్ధన్ వర్మ తాగుడికి బానిసైపోతాడు. మరోవైపు ఆ శాపం ప్రభావం వైతరణ్ మీద మరింత ఘోరంగా పడుతుంది. అతనిపై సూర్యకాంతి పడితే చర్మం కాలిపోయి చనిపోయే వింత వ్యాధి బారిన పడతాడు వైతరణ్. అందువల్ల అతనికి లోకమే తెలీదు, చీకటి గదిలోనే పెరుగుతాడు.

అందువల్ల సైకోలా మారిపోతాడు. సూర్య వర్ధన్ కుటుంబ పరిస్థితిని గమనించిన అతని స్నేహితుడు సూర్యనారాయణ (సూర్య), సూర్య వర్ధన్‌కి సంధ్య (ఆమని)తో రెండో పెళ్లి చేస్తాడు. సంధ్య రాకతో ఆ ఇంట్లో చీకట్లు తొలగిపోతాయి. వైతరణ్‌ని ప్రాణంగా చూసుకుంటూ తల్లి లేని లోటు తీరుస్తుంది. సూర్య వర్ధన్ కూడా తాగుడు మానేసి ప్రశాంతంగా ఉంటాడు.అంతా బాగుంది అనుకునే టైంలో, ఒకరోజు వైతరణ్ దారుణంగా తన తండ్రి సూర్య వర్ధన్ వర్మని చంపేస్తాడు. కొద్దిరోజుల తర్వాత పెంచిన తల్లి సంధ్యని సైతం హతమారుస్తాడు! అసలు అంతగా ప్రేమించిన తల్లిని వైతరణ్ ఎందుకు చంపాల్సి వచ్చింది? సూర్యనారాయణ కొడుకైన సంపత్(రవివర్మ).. వైతరణ్ కుటుంబానికి చేసిన ద్రోహం ఏంటి? మరి ఈ మొత్తం కథలో శివ (మాస్టర్ మహేంద్రన్) ఎవరు? మాయ(శ్రద్దాదాస్) ఎవరు? శివ ప్రేమించిన అమ్మాయి నిధి ఏమైంది? సంపత్ చేసిన ద్రోహాన్ని శివ ఎలా బయటపెట్టాడు? కాటేరమ్మ శాపం నుండి వైతరణ్ కి విముక్తి కలిగిందా లేదా? అసలు వైతరణ్ ఎలా చనిపోయాడు? అనేది మిగిలిన కథ.

Trikala Movie Review and Rating

నటీనటుల పనితీరు: మాస్టర్ మహేంద్రన్ ఈ సినిమాలో హీరో అయినప్పటికీ కథంతా నడిచేది వైతరణ్ గా చేసిన అజయ్ పాత్ర చుట్టూ అనే చెప్పాలి. మాస్టర్ మహేంద్రన్ తన పాత్ర వరకు న్యాయం చేశాడు. కానీ ఎక్కువగా హైలెట్ అయ్యింది అజయ్ పాత్రే. వైతరణ్ గా అజయ్ ది బెస్ట్ ఇచ్చాడు. కొన్ని చోట్ల అతన్ని చూస్తేనే భయమేస్తూ ఉంటుంది. సైకాలజీ స్పెషలిస్ట్ అండ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మాయ పాత్రకి శ్రద్ధాదాస్ బాగానే సెట్ అయ్యింది. తల్లి పాత్రలో ఆమని మంచి ఆప్షన్ అనిపించుకుంది.

ఆమె చెప్పిన కొన్ని డైలాగులు బాగుంటాయి. కానీ ఆ పాత్రను ముగించిన తీరు కొంచెం డిజప్పాయింట్ చేస్తుంది. దేవి ప్రసాద్ బాగానే చేశాడు. రవివర్మ కన్నింగ్ విలన్ రోల్స్ కి పెట్టింది పేరు. ఈ సినిమాలో కూడా అతని మార్క్ నటనతో హైలెట్ అయ్యాడు. సీనియర్ నటుడు సూర్య చాలా కాలం తర్వాత కనిపించాడు. ఎప్పటిలానే తన పాత్రకి జీవం పోశాడు. ఈ సినిమాలో దివంగత నటుడు ఫిష్ వెంకట్ కూడా నటించాడు. ఆడియన్స్ అతన్ని చూడగానే నోస్టాలజిగా ఫీలవుతారు. ఛత్రపతి శేఖర్ కూడా తన పాత్రకి న్యాయం చేశాడు.

Trikala Movie Review and Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: ‘త్రికాల’…. టైటిల్, అలాగే ‘స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’ అనే క్యాప్షన్ చూసిన ఏ ప్రేక్షకుడైనా ఇది ఒక మంచి మైథాలజీ సబ్జెక్ట్ ఏమో అనుకుంటాడు. ఆ రేంజ్ సెటప్ కూడా ఈ కథలో ఉంది. దర్శకుడు మణి ఎంపిక చేసుకున్న పాయింట్ చాలా బాగుంది. సినిమా మొదలైన మొదటి 5 నిమిషాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ, ఎప్పుడైతే హీరో ట్రాక్ మొదలైందో అక్కడ కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అయినప్పటికీ కొన్ని కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు వచ్చి వెళ్తుండటం వల్ల టైం పాస్ అయిపోతుంది. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ వద్ద వచ్చే హర్రర్ ఎఫెక్ట్స్ బాగా కుదిరాయి, భయపెట్టాయి అని కూడా చెప్పొచ్చు. వాటికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా సెట్ అయ్యింది. కథకుడిగా కూడా దర్శకుడు మణి తన టాలెంట్ తో మెప్పించే ప్రయత్నం చేశాడు. కొత్త దర్శకుడైనప్పటికీ ఎక్కడా బ్యాలన్స్ తప్పలేదు. ‘యానిమల్’ వంటి సెన్సేషనల్ మూవీకి సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

కానీ కొన్ని చోట్ల షాజిత్ హుమయున్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఉంది. బహుశా ఇతను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి ఉండొచ్చు! ఒక పాట వినడానికి బాగుంది. ప్రేతాత్మ ట్రాక్ వచ్చాక.. సినిమా ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా మారుతుంది.చివరికి వైతరణ్ పాత్ర ‘త్రికాల’ అనే దేవుడి పాత్రగా మార్చడం అనేది ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్..కి నచ్చుతుంది.సినిమాటోగ్రఫీ పరంగా చూసుకుంటే.. సినిమా స్టార్టింగ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ విజువల్స్ భలే అనిపిస్తాయి. సినిమాకి రిచ్ నెస్ కూడా తీసుకొచ్చాయి. ఇంత మంది స్టార్ క్యాస్టింగ్ ను పెట్టుకోవడాన్ని బట్టి నిర్మాత ఎంతో ప్యాషనేట్ గా కథకి కావాల్సినంత ఖర్చు చేశారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Trikala Movie Review and Rating

విశ్లేషణ: మంచి టైటిల్, బలమైన థీమ్, క్రేజీ క్యాస్టింగ్, టాలెంటెడ్ టెక్నికల్ టీం వర్క్ వంటివన్నీ ఈ ‘త్రికాల’ కి మేజర్ ప్లస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్ ని ఇంకాస్త క్లారిటీగా తెరకెక్కించి ఉండుంటే.. దీని స్థాయి ఇంకా పెరిగేది. థియేటర్లో ఒకసారి ట్రై చేసే సినిమా అనే చెప్పాలి.

Trikala Movie Review and Rating

ఫోకస్: డీసెంట్ మైథలాజికల్ థ్రిల్లర్

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ajay
  • #Mahendran
  • #Master Mahendran
  • #Sahithi Avancha
  • #Shraddha Das

Reviews

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

12 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

13 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

14 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

11 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

13 hours ago
Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

13 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

14 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version