‘ఆచార్య’ నుండీ తప్పుకున్న త్రిష..కారణం అదే..?

మెగాస్టార్ 152 వ చిత్రం కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ అనే టైటిల్ ను ఈ చిత్రానికి పరిశీలిస్తున్నారు. ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ మరియు ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ల పై.. రాంచరణ్, నిరంజన్ రెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు అంటూ వార్తలొచ్చాయి. అయితే బడ్జెట్ ఎక్కువైపోతుందని.. ముందుగా అనుకున్నట్టుగానే చరణ్ తోనే ఆ పాత్రను చేయించడానికి టీం డిసైడ్ అయ్యారట. ఇదిలా ఉంటే.. ఇప్పడు ఈ చిత్రం నుండీ హీరోయిన్ త్రిష కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ షాకిచ్చింది.

తన ట్విట్టర్ ద్వారా త్రిష స్పందిస్తూ… ” జీవితంలో అన్నీ మనం ప్లాన్ చేసుకున్నట్టు జరుగుతాయని చెప్పలేం. కొన్ని సార్లు మనం కచ్చితంగా చేద్దాం అని డిస్కస్ చేసుకున్నవి కూడా జరుగకపోవచ్చు. కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ ల వల్ల చిరు సార్.. సినిమా నుండీ నేను తప్పుకుంటున్నాను. ఆ చిత్ర యూనిట్ సభ్యులందరికీ నా గుడ్ లక్. ఇక నన్ను ఎంతగానో అభిమానించే నా తెలుగు ప్రేక్షకులని… త్వరలోనే మంచి ప్రాజెక్ట్ తో పలకరిస్తాను” అంటూ చెప్పుకొచ్చింది. త్రిష ఇలా ట్వీట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. మరి త్రిష ప్లేస్ లో ఏ హీరోయిన్ ను ఎంపిక చేసుకుంటారు అనే డిస్కషన్లు కూడా మొదలయ్యాయి.


Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus