Trisha, Kajal: ‘ఇండియన్ 2’ హీరోయిన్ మారిందా..?

కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ‘ఇండియన్ 2’. కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. ఫైనల్ గా అందరూ రాజీ పడడంతో శంకర్ షూటింగ్ మొదలుపెట్టడానికి ఒప్పుకున్నాడు. డిసెంబర్ నుంచి సినిమా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్న కాజల్ సినిమా నుంచి తప్పుకుందట.

కొన్నిరోజులుగా కాజల్ ప్రెగ్నంట్ అని వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా.. తను ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకుంటుంది ఈ బ్యూటీ. ఇప్పటికే నాగార్జున సినిమా నుంచి తప్పుకుంది. ఇప్పుడు కమల్ హాసన్ సినిమాను కూడా వదిలేయాల్సిన పరిస్థితి. దీంతో కాజల్ స్థానంలో త్రిషను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. నిజానికి ఇందులో కాజల్ వయసైన పాత్రలో కనిపించాల్సివుంది. ఆమెకి ప్రొస్థెటిక్ మేకప్ సూట్ అవ్వడంతో ఆమెని ఫైనల్ చేసుకున్నారు.

ఇప్పడూ అదే మేకప్ టెస్ట్ త్రిషపై జరిపినట్లు తెలుస్తోంది. దాదాపు ఆమెని ఫైనల్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్ లాంటి స్టార్లు కూడా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమాను తెరకెక్కిస్తున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus