తమిళ నటి త్రిష గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర లేదు.. ‘నీమనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయం అయ్యింది ఈ తమిళ పొన్ను. ఆ తర్వాత వరుసగా తెలుగులో నటిస్తూ.. కొన్నాళ్లపాటు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణించింది. ఇక 40 ఏళ్ల ఏజ్‌లో కూడా అందంలో కుర్ర హీరోయిన్స్‌కు పోటీ ఇస్తూ వావ్ అనిపిస్తోంది. అంతేకాదు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగింది.
త్రిష ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ అనే సినిమా ద్వారా మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది . అయితే ఇటీవల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా యానిమల్. ఈ సినిమాలో బాలీవుడ్ లవర్ బాయ్ రణ్ బీర్ కపూర్ హీరోగా నటించగా.. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అభిమానులకు తెగ నచ్చేసింది. విడుదలైన ఫస్ట్ రోజే వంద కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డు నెలకొల్పింది.
కొంతమందికి సినిమా మరీ బోల్డ్ గా కనిపించినప్పటికీ.. మరికొంత మందికి సందీప్ డైరెక్షన్ తెగ నచ్చేసింది. ఈ సినిమా విడుదలైన తర్వాత పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు రివ్యూ ఇస్తున్నారు . ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ త్రిష అద్దిరిపోయే రివ్యూ ఇచ్చింది. యానిమల్ సినిమా పోస్టర్ ని షేర్ చేస్తూ వన్ డైలాగ్ అంటూ “కల్ట్” అంటూ సినిమాకి సంబంధించిన బోల్డ్ సీన్స్ పై ఈమోజీ పిక్చర్స్ తో షేర్ చేసింది.
అంతే (Trisha) త్రిషపై నెటిజన్లు బండ బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు. నిన్న కాక మొన్ననేగా మన్సూర్ అలీ ఖాన్ ఇలా మాట్లాడాడు.. అలా మాట్లాడాడు అంటూ మండిపడ్డావు. మరి సినిమాలో ఇంత బూతు కంటెంట్ ఉంటే నువ్వు ఎలా ఎంకరేజ్ చేస్తున్నావంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దాంతో దెబ్బకు దారిలోకి వచ్చిన త్రిష ఆ పోస్టర్ వెంటనే డిలీట్ చేసేసింది. అయినా సరే అప్పటికే స్క్రీన్ షాట్ తీసి జనాలు ఆమెను ట్రోల్ చేసేస్తున్నారు.