టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న త్రిషను అరెస్ట్ చేయాలని నెటిజన్లు, హిందూ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. త్రిషతో పాటు దర్శకుడు మణిరత్నంను కూడా అరెస్ట్ చేయాలని హిందూ సంఘం నేతలు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. మణిరత్నం డైరెక్షన్ లో హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో పొన్నియిన్ సెల్వన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయంరవిలతో పాటు ఐశ్వర్యారాయ్, త్రిష నటిస్తున్నారు.
ఇండోర్ లో పొన్నియిన్ సెల్వన్ షూటింగ్ జరుగుతుండగా త్రిష శుక్రవారం రోజున చెప్పులతో శివుడు, నంది విగ్రహాల మధ్య నడుచుకుంటూ వచ్చారు. త్రిష ఈ విధంగా చేయడాన్ని హిందూ సంఘాల నేతలు ఖండించడంతో పాటు హరికేష్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై త్రిష ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన త్రిష ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు.
తెలుగులో ఒక భారీ బడ్జెట్ సినిమాకు త్రిష గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. కొన్నిరోజుల క్రితం పొన్నియిన్ సెల్వన్ షూటింగ్ కోసం తెచ్చిన గుర్రాలలో ఒక గుర్రం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదైంది. వరుస వివాదాల ద్వారా పొన్నియిన్ సెల్వన్ సినిమా నటులు, దర్శకుడు వార్తల్లో నిలవడం గమనార్హం. త్రిష, మణిరత్నంలను అరెస్ట్ చేయకుంటే కోర్టును ఆశ్రయిస్తామని హిందూ సంఘం నేతలు చెబుతున్నారు.
Most Recommended Video
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!