నువ్వు ఆ పొజిషన్ కి అనర్హురావిలి అంటూ త్రిషపై ఫ్యాన్స్ కామెంట్స్

  • September 18, 2018 / 09:51 AM IST

కథానాయికగా పదేళ్ళ అనుభవం, స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించిన స్టార్ డమ్ తోపాటు భీభత్సమైన క్రేజ్ సంపాదించుకొన్న త్రిష ఈమధ్యకాలంలో సరైన హిట్ లేక కాస్త ఢీలాపడింది. అయితే.. తెలుగు-తమిళ భాషల్లో కాకుండా మలయాళ, కన్నడ చిత్రాల్లో కంటెంట్ ఉన్న సినిమాల్లో నటిస్తూ తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది. అయితే.. మొన్నామధ్య త్రిష స్విమ్మింగ్ పూల్లో ఒక డాల్ఫిన్ తో ఆడుకుంటూ తీయించుకొన్న కొన్ని ఫోటోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అప్పట్నుంచి ఆమెను ట్రోల్ చేస్తున్నారు కొందరు. అందుకు కారణం ఆమె కథానాయిక మాత్రమే కాదు ఉనిసెఫ్ మెంబర్ మరియు బ్రాండ్ అంబాసిడర్ కూడా కావడం.

సముద్రంలో ఉండాల్సిన డాల్ఫిన్స్ ను తమ సంతోషం కోసం స్విమ్మింగ్ ఫూల్స్ లో ఇరికించడాన్ని ఉనిసెఫ్ తప్పు పనిగా పేర్కొంటుంది. అలాంటి సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న త్రిష ఇలా డాల్ఫిన్ తో స్విమ్మింగ్ పూల్లో ఫోటోలు దిగి పోస్ట్ చేయడం పట్ల కొందరు సీరియస్ అయ్యారు. అయితే.. త్రిష ఆ నెగిటివ్ కామెంట్స్ ను డిలీట్ చేయడం గమనార్హం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus