టాలీవుడ్ ప్రేక్షకులకి స్టార్ హీరోయిన్ త్రిషని ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. గతంలో ఈమె తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అయితే ఇప్పుడు తెలుగు సినిమాల్లో ఆమె నటించడం లేదు.చిరంజీవి ‘ఆచార్య’ మూవీలో ఎంపికైనా… క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన తప్పుకున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె తమిళంలో మాత్రమే సినిమాలు చేస్తూ వస్తుంది. అయితే పెళ్లి వార్తలతో మాత్రం ఆమె నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంది.
ప్రస్తుతం త్రిష వయసు 38 సంవత్సరాలు. కానీ ఇంకా ఆమె పెళ్లి చేసుకోలేదు.ఓ దశలో ఈమె ప్రముఖ బిజినెస్మెన్ వరుణ్ మణియన్ ను పెళ్లి చేసుకోవాల్సిందే..! వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ అది పెళ్లి వరకు వెళ్ళలేదు. కొద్దిరోజుల నుండీ త్రిష పెళ్లి వార్తలు మరింత ఎక్కువయ్యాయి. ఓ దర్శకుడితో త్రిష పెళ్లి ఫిక్స్ అయినట్టు కొద్దిరోజుల నుండీ వార్తలు వస్తున్నాయి. ఇదే విషయం పై త్రిష టీం ను ప్రశ్నించగా వారు దీన్ని తీవ్రంగా ఖండించారు. ‘ఏ దర్శకుడితోనూ త్రిష పెళ్లి ఫిక్స్ అవ్వలేదు.
దయచేసి ఇలాంటి వార్తలను నమ్మొద్దు. మేడం కొన్ని సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.ఇంకొన్ని కథలను కూడా వింటున్నారు. కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసేవరకు వేరే ఆలోచన పెట్టుకోవద్దు అని కూడా చెప్పారు’ అంటూ త్రిష టీం సభ్యులు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం త్రిష ‘పొన్నాయన్ సెల్వన్’, ‘సతురంగ వెట్టాయ్’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.
Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!