మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్న త్రిష..?

బాలీవుడ్ లో అమితాబ్ .. తాప్సీ ప్రధానమైన పాత్రలుగా రూపొందిన ‘బద్లా’ చిత్రం మర్చి 8న విడుదలయ్యి సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని భారీ వసూళ్ళను రాబడుతూ దూసుకుపోతుంది ఈ చిత్రం. తాప్సి,అమితాబ్ ల నటన ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా అమితాబ్ లాంటి గొప్ప నటుడితో పోటీపడి నటించిన తాప్సి కి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెలుగు .. తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి ప్రముఖ నిర్మాత ధనుంజయ్ ప్లాన్ చేస్తున్నారట.

‘తనకి తెలియకుండా ఓ హత్య కేసులో ఇరుక్కున్న తాప్సీని బయటపడేయడానికి ఓ లాయర్ గా అమితాబ్ రంగంలోకి దిగుతాడు. ఆ తరువాత చోటుచేసుకున్న పరిష్టితులేంటి… అసలు తాప్సి ఈ కేసులో ఎందుకు ఇరుక్కుంది… అనేది ఉత్కంఠంగా సాగుతూ ఓ మలుపుతో చిత్రం ముగుస్తుంది. తాప్సీ చేసిన ఈ పాత్ర కోసం త్రిషను తీసుకోబోతున్నారని సమాచారం. ఇటీవల ’96’ లాంటి హిట్ చిత్రంతో త్రిష మళ్ళీ ఫామ్లోకి వచ్చేసింది. దీంతో ఈ పాత్ర కోసం ఆమెను ఎంచుకున్నారని కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. మరి ఈ పాత్రలో త్రిష ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus