త్రివిక్రముడి పరాక్రమం నీరుగారిన వేళ!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు మొట్టమొదటిసారిగా మాయ చేయకపోవడం అటుంచి, అతని స్థాయిని దిగజార్చాయి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “అ ఆ” సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నప్పటికీ.. సదరు సినిమా కథను సులోచనా రాణిగారి “మీనా” అనే నవల నుంచి కాపీ కొట్టారని, కొడితే తప్పు లేదు కానీ ఆమెకు కనీసం “కృతజ్ఞత” సైతం చూపకపోవడం అన్యాయం అంటూ వెబ్ మీడియా త్రివిక్రమ్ ను నిలదీసింది.

ఇందుకు వివరణ ఇస్తూ త్రివిక్రమ్ “టెక్నికల్ కారణాల వల్ల “థ్యాంక్స్ కార్డ్” సినిమాలో యాడ్ అవ్వలేదు, రేపట్నుంచి చూడొచ్చు, ఇంతకు మించి ఏమీ చెప్పలేను” అని సింపుల్ గా చాలా సిల్లీ రీజన్ చెప్పడం.. మీడియాకు మాత్రమే కాదు త్రివిక్రమ్ వీరాభిమానులకు కూడా రుచించలేదు.

మరి త్రివిక్రమ్ లాంటి తెలివైన దర్శకుడు, చక్కని రచయిత కూడా ఈ విధంగా ఆయనకు ఏమాత్రం సరితూగని స్థాయిలో ప్రవర్తించడం ఎంతవరకూ సమంజసమో ఆయనే ఒకసారి ఆలోచించాలి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus