Trivikram: నాలుగు వచ్చాయి.. ఏం లాభం లేదు.. గురూజీ ఎందుకిలా అంటున్న ఫ్యాన్స్‌

సినిమా కథలు, మాటల విషయంలో త్రివిక్రమ్‌ను కొట్టేవారు లేరు అంటుంటారు. ప్రేమకథ ఎంచుకున్నా, మాస్‌ సినిమా పట్టుకున్నా, క్లాస్‌ పిక్చర్‌ తీసినా.. ఇలా ఏం చేసినా తన ముద్ర వేస్తుంటారు. పాటల రచయితగానూ ఆయనకు మంచి పేరు ఉంది. అయితే ఇదంతా సినిమా నిర్మాణంలో ఉపయోపగడటం లేదా? ఏమో వరుసగా ఆయన ప్రొడక్షన్‌ హౌస్‌ సినిమాలు చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఎందుకంటే వరుసగా రెండు సినిమాలు బోల్తా కొట్టాయి. ఫార్చ్యూన్‌ ఫోర్‌ పేరుతో త్రివిక్రమ్‌ ఓ సినిమా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అతని సతీమణి సౌజన్య ఆ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అయితే సినిమాల ఎంపికలు, కథల లెక్కల విషయంలో త్రివిక్రమ్‌ అంతోకోంత చేయి వేస్తున్నారు అంటారు. అయితే ఆ నిర్మాణ సంస్థ నేరుగా కాకుండా సితార ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలసి సినిమా నిర్మిస్తోంది. అలా ఇప్పటివరకు ఓ నాలుగు సినిమాలు చేశారు. సితార, ఫార్చ్యూన్‌ ఫోర్‌ కలసి ఇప్పటివరకు తీసిన సినిమాలు చూస్తే.. ‘డీజె టిల్లు’, ‘స్వాతి ముత్యం’, ‘బుట్టబొమ్మ’. ఈ మూడు సినిమాల్లో ‘డీజే టిల్లు’ ఒకటే విజయం సాధించింది.

మిగిలిన రెండు సినిమాలు సరైన ఫలితం అందుకోలేదు. ‘స్వాతిముత్యం’ గుడ్డిలో మెల్ల లాగా కాస్త ఫర్వాలేదనిపించినా.. ‘బుట్ట బొమ్మ’ అయితే మరీ దారుణం. ఇవి విజయం పరంగా, కంటెంట్‌ పరంగా ఎలా చూసినా త్రివిక్రమ్‌ స్థాయి సినిమాలు కావు. దీంతో అసలు ఇలాంటి కథల్ని గురూజీ ఎలా ఓకే చేస్తున్నారు అనే చర్చ నడుస్తోంది. పవన్‌ కల్యాణ్‌ కోసం ఇతరుల కథలు, రీమేక్‌లు తీసుకొని సిద్ధం చేసి ఇస్తున్నారు త్రివిక్రమ్‌.

అలాంటిది తన సొంత బ్యానర్‌ కోసం చేస్తున్న సినిమా మీద అదనపు దృష్టి పెట్టి విజయాల సినిమాలు తీయొచ్చు కదా అనే చర్చ నడుస్తోంది. మరి ఈ విషయంలో త్రివిక్రమ్‌ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడాలి. త్వరలో ఇవే బ్యానర్స్‌లో చేసిన ‘మాస్టర్‌’ / ‘వాతి’ ఈ నెల 17న విడుదలవుతోంది. ఆ తర్వాత ‘టిల్లు స్క్వేర్‌’ కూడా ఉంది.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus