Trivikram: అల్లు అర్జున్, వెంకటేష్..లతో సినిమాల విషయంలో త్రివిక్రమ్ ఆలోచన మారిందా?

‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఆ సినిమా హీరో మహేష్ బాబు (Mahesh Babu).. రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా మొదలుపెట్టేశాడు. కానీ దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram)  మాత్రం ఇంకా తన నెక్స్ట్ సినిమాని ప్రకటించింది లేదు. అల్లు అర్జున్ తో (Allu Arjun)  త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఉంటుందని చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన వచ్చింది. కానీ స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ టైం తీసుకోవడంతో అల్లు అర్జున్.. దర్శకుడు అట్లీకి (Atlee Kumar) ఛాన్స్ ఇచ్చాడు.

Trivikram

ఈ క్రమంలో వెంకటేష్ తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందనే ప్రకటన వచ్చింది. ఆల్మోస్ట్ ఈ కాంబోలో మూవీ పక్కా అని అంతా అనుకున్నారు. ఇంతలో చరణ్ తో (Ram Charan) కూడా సినిమా సెట్ చేసుకునే పనిలో పడ్డాడు త్రివిక్రమ్. చరణ్ తో కూడా సినిమా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు వినికిడి. ‘పెద్ది’ (Peddi)  తర్వాత సుకుమార్ తో (Sukumar) తన 17వ సినిమా చేయాలని చరణ్ భావించాడు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ సుకుమార్.. స్క్రిప్ట్ ప్రాపర్ గా కంప్లీట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటాడట.

దీంతో త్రివిక్రమ్ స్క్రిప్ట్ పై ఫోకస్ చేశాడు చరణ్. అయితే ఈ మధ్యలో వెంకటేష్ (Venkatesh)  సినిమా ఉంటుందా? లేక డైరెక్ట్ గా చరణ్ తోనే సినిమా చేస్తాడా? వెంకటేష్ సినిమా పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ సినిమా ఉంటుంది అని అంతా అనుకున్నారు. కానీ మళ్ళీ చరణ్ తో సినిమా సెట్ చేసుకుంటే.. బన్నీతో సినిమా ఇక ఉంటుందా? ఉంటే ఎప్పుడు ఉంటుంది? ఈ ప్రశ్నలకి సమాధానాలు దొరకాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

నితిన్ ‘తమ్ముడు’ కి అసలు పరీక్ష..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus