Trivikram: త్రివిక్రమ్ – మహేష్.. నాని ఓకే అంటే?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాను మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు విషయంలో అనేక సార్లు చర్చలు జరిపిన అనంతరం మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని అభిమానులు కూడా ఎంతగానో నమ్ముతున్నారు. అతడు ఖలేజా సినిమాల తర్వాత మళ్లీ ఈ కలయిక లో చాలా రోజుల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది అని చెప్పవచ్చు.

అయితే ఈ సినిమాలో కూడా దర్శకుడు త్రివిక్రమ్ ఒక ముఖ్యమైన పాత్ర కోసం మీడియం రేంజ్ హీరోలను సంప్రదించి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో అయితే సుధీర్ బాబు తమిళ హీరో ఆర్య అలాగే మరో ఇద్దరు ముగ్గురు పై కూడా త్రివిక్రమ్ ఫోకస్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఇక ఆ విషయంలో మహేష్ బాబు తో కూడా రెగ్యులర్ గా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్ చాలా ఆలస్యంగా మొదలవుతుంది.

ఇక వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలి అని ఆలోచిస్తున్నారు. అయితే మీడియం రేంజ్ హీరోల్లో నాని కూడా చాలా బాగా సెట్ అవుతాడు అని అతనిపై కూడా త్రివిక్రమ్ ఫోకస్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు కానీ సెట్టయితే మాత్రం మహేష్ బాబు నాని కాంబినేషన్ మాత్రం అదిరిపోతుంది అని చెప్పవచ్చు. కానీ నాని కూడా తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ తో కొనసాగుతున్నాడు కాబట్టి

మహేష్ బాబు తో సినిమా చేస్తే మరో భీమ్లా నాయక్ తరహాలో ఉంటుంది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మహేష్ బాబు తప్పకుండా డామినేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ సెట్ అవ్వడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. మరి త్రివిక్రమ్ ఏవిధంగా ఆలోచిస్తాడు చూడాలి. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను జూలై నెలలో స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో లేదా సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus