అనుకోని శత్రువు కరోనా వైరస్ దాడి అన్ని పరిశ్రమలను కుదేలు చేసింది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ కరోనా వైరస్ కారణంగా కుదేలయ్యింది. దర్శక నిర్మాతలు, హీరోల ప్రణాళికలు మొత్తం తారుమారయ్యాయి. నెలల తరబడి షూటింగ్స్ లేక అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ లాక్ డౌన్ వలన నష్టపోయిన హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. ఆర్ ఆర్ ఆర్ వలన 2019ని ఎటువంటి విడుదల లేకుండా జీరో ఇయర్ గా ముగించిన ఎన్టీఆర్, 2020ని కూడా కోల్పోనున్నారు.
అలాగే 2021లో సంక్రాంతికైనా మూవీ విడుదల అవుతుందని అనుకుంటే లాక్ డౌన్ వలన మరింత లేటయ్యింది. రెండేళ్లు ఎన్టీఆర్ నుండి మూవీ రాకపోయినా 2021లో సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్, ఆ వెంటనే సమ్మర్కి త్రివిక్రమ్ మూవీ విడుదల చేయాలని ఆయన ప్రణాళిక వేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఏక కాలంలో ఆర్ ఆర్ ఆర్, త్రివిక్రమ్ చిత్రాలలో ఎన్టీఆర్ నటించే అవకాశం లేదు. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తవడానికే కనీసం మరో ఏడాది సమయం పట్టేలా కనిపిస్తుంది.
దీనితో ఎన్టీఆర్ తో మూవీ కమిటైన త్రివిక్రమ్ కి ఏమి పాలుపోవడం లేదు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా మూవీ షూటింగ్ పూర్తి చేయాలని త్రివిక్రమ్ ఆలోచన చేస్తున్నారట. దీని కోసం ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ బయటికి వచ్చిన వెంటనే లాంగ్ షెడ్యూల్స్ ద్వారా షూటింగ్ చుట్టేయాలని చూస్తున్నారట. 2021 చివరికల్లా లేదా 2022 ప్రారంభంలో లో ఎన్టీఆర్ 30మూవీ విడుదల చేయాలనేది ఆయన ఆలోచనగా తెలుస్తుంది.
Most Recommended Video
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ 4 హైలెట్స్: బిగ్‌బాస్ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!