త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్న హీరోలు ఎవరంటే?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ మూవీల హావ నడుస్తోంది. కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని నటించిన దేవదాస్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది. అలాగే హ్యాట్రిక్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లతో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. F2 అనే టైటిల్, ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే ట్యాగ్ లైన్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.  అలాగే బాబీ కూడా నాగ చైతన్య, వెంకీలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారు. ఇది త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. యువ డైరక్టర్లు మాత్రమే కాకుండా స్టార్ డైరక్టర్లు కూడా మల్టీస్టారర్ బాట పడుతున్నారు. రాజమౌళి బాహుబలి చిత్రాల తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు.

దీంతో మరో స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మల్టీస్టారర్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు. త్రివిక్రమ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ మూవీ చేస్తున్నారు. దీని తర్వాత వెంకటేష్ తో సినిమా చేయనున్నారు. అయితే అది అతనొక్కడితో కాకుండా అల్లు అర్జున్ ని కూడా యాడ్ చేసుకుంటే ప్రాజెక్ట్ పై క్రేజ్ పెరిగిపోతుందని భావిస్తున్నారు. అందుకే ఈ విషయాన్నీ వెంకీతో చెప్పడంతో ఒప్పుకున్నారంట. ఇక బన్నీ కి ఎక్కువ సీన్లు ఉండే విధంగా కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అరవింద సమేత రిలీజ్ కాగానే ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus