ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ తాజా అప్డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవ కుశ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి షెడ్యూల్ గతవారం హైదరాబాద్ లో మొదలయింది. యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నారు. దీని తర్వాత రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేయనున్నారు. నాలుగు కోట్లతో రాయలసీమలోని ఒక గ్రామానికి చెందిన సెట్ ని అక్కడ నిర్మిస్తున్నారు. ఈ సెట్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర న్యూస్ బయటికి వచ్చింది. డైరక్టర్ ఇక్కడ షాట్స్ కంప్లీట్ చేస్తుంటే..

మ్యూజిక్ డైరక్టర్ థమన్ ముంబై లో సాంగ్స్ రికార్డింగ్ కంప్లీట్ చేస్తున్నారు. రీసెంట్ గా మూడు సాంగ్స్ ని పూర్తి చేసినట్లు తెలిసింది. ఎన్టీఆర్ రేంజ్ కి తగ్గట్టు.. త్రివిక్రమ్ ఆలోచనలకు దగ్గరగా ఈ పాటలు ఉండనున్నాయని సమాచారం. హీరోయిన్ గా జిగేల్ రాణి పూజా హెగ్డే నటిస్తున్న ఈ మూవీ ద్వారా సునీల్ మళ్ళీ హాస్యనటుడిగా రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. జగపతిబాబు విలన్ గా నటిస్తున్న ఈ మూవీలో అలనాటి హీరోయిన్స్ కీలకపాత్రలు పోషించనున్నారు. తొలిసారి ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus