త్రివిక్రమ్ గారూ.. ఇది సాధ్యమేనా..?

  • April 15, 2019 / 01:16 PM IST

కొందరు సీనియర్ నటీమణుల్ని మళ్ళీ తన సినిమాల్లో అమ్మ, అత్త, వదిన లాంటి పాత్రలు ఇచ్చి వారికి మళ్ళీ వారికి రీ ఎంట్రీ అవకాశం ఇస్తుంటాడు త్రివిక్రమ్. ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు త్రివిక్రమ్. ఇటీవల పూజా కార్యక్రమంతో ఘనంగా మొదలైంది ఈ చిత్రం. ‘గీతా ఆర్ట్స్’ ‘హారిక అండ్ హాసిని’ క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఒకప్పటి హాట్ హీరోయిన్ టబును కూడా తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో బన్నీకి తల్లిగా నటిస్తుందని టాక్ నడుస్తుంది.

టబు అంటేనే గ్లామర్ క్వీన్. గతంలో నాగార్జున ‘నిన్నే పెళ్ళాడతా’ వెంకటేష్ ‘కూలీ నెం1’ చిత్రాల్లో తన అందాలతో ఉతికి ఆరేసింది. ఇప్పటి కుర్రకారు కూడా ఆ చిత్రాలోని టబు హాట్ హాట్ అందాలకి ఫిదా అయిపోతున్నారు. అంతే కాదు ఈమె ఛాన్స్ దొరికినప్పుడల్లా బాలీవుడ్లో గ్లామర్ సన్నివేశాల్లో నటిస్తూనే ఉంది. మరి అలాంటి హీరోయిన్ని తల్లి పాత్రలో ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా.. ? అనేది చర్చనీయాంశం అయ్యింది. త్రివిక్రమ్ కాబట్టి రెండు బలమైన్ సీన్స్ తో నాలుగు లోతైన డైలాగ్ లతో తల్లిగా ఒప్పించేస్తాడు. అయినప్పటికీ టబును ఈ పాత్రకి ఒప్పుకుంటారా అంటే… అనుమానంగానే ఉంది. సింధుతులాని లాంటి గ్లామర్ క్వీన్ నే అల్లు అర్జున్ కు వదినను చేసేసాడు.. అలాంటిది టబు ని తల్లి పాత్రలో ఇరికించడం త్రివిక్రమ్ కు పెద్ద కష్టమేమీ కాదు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus