Trivikram, Vaisshnav Tej: వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా అనౌన్స్మెంట్..!

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకొని అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్నాడు. అమ్మాయిల్లో కూడా అతడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. రీసెంట్ గా ‘కొండపొలం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా.. విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఈ హీరో మంచి జోరు మీదున్నాడు. వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు.

ఇప్పటికే గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దీన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్ పీ బ్యానర్ పై బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆబాల గోపాలం’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారని సమాచారం. ఈరోజు ఈ సినిమా టైటిల్ పై క్లారిటీ రానుంది. ఇదిలా ఉండగా.. ఈరోజు వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా నాల్గో సినిమాను అనౌన్స్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి త్రివిక్రమ్ ఈ సినిమాను రూపొందించబోతున్నారు.

ఓ వీడియోను రిలీజ్ చేసి వైష్ణవ్ కి బర్త్ డే విషెస్ చెబుతూ.. సినిమాను అనౌన్స్ చేశారు. దర్శకుడు ఎవరనే విషయాన్ని ప్రకటించలేదు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus