టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. బాలీవుడ్ నిర్మాణ సంస్థలతో కలిసి రూ.500 కోట్ల భారీ బడ్జెట్ లో రామాయణం సినిమా తీయబోతున్నట్లు అనౌన్స్ చేసి చాలా కాలం అవుతోంది. కానీ ఆ దిశగా అడుగులు పడడం లేదు. ఈ కథ పట్టాలెక్కడానికి ముందే అదే కథ స్పూర్తితో ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ సినిమాను ప్రకటించారు. దీంతో అల్లు వారి రామయం ఆగిపోతుందేమోననే సందేహాలు కలిగాయి. కానీ అల్లు అరవింద్ మాత్రం ఈ ప్రాజెక్ట్ విషయంలో పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.
‘దంగల్’ దర్శకుడు నితీష్ తివారి దర్శకత్వంలో ఆయన రామాయణం తీయాలనుకుంటున్నారు. దీనికోసం ప్రీప్రొడక్షన్ పనులు కూడా మొదలెట్టేశారు. రామాయణం కథను పలు భాషల్లో భారీగా తెరకెక్కించాలనేది అల్లు అరవింద్ ప్లాన్. తెలుగు వెర్షన్ కోసం ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సాయాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అరవింద్ కోరినట్లు రామాయణం మొత్తాన్ని మూడు గంటల సినిమా స్క్రిప్ట్ గా మార్చారట త్రివిక్రమ్. తెలుగులో డైలాగ్ వెర్షన్ కూడా ఆయనే రాశారట. దీన్ని ఆధారంగా చేసుకొని మిగిలిన స్క్రిప్ట్ లను తయారు చేసుకుంటారు.
ఈ జనరేషన్ వాళ్లకి నచ్చే విధంగా.. రామాయణం ఔన్నత్యం, ఔచిత్యం దెబ్బ తినకుండా త్రివిక్రమ్ ఈ కథను తయారు చేసినట్లు చెబుతున్నారు. తన తదుపరి సినిమాలకు స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటూనే రామాయణం కథపై కూడా వర్క్ చేస్తున్నారట త్రివిక్రమ్. దాదాపు స్క్రిప్ట్ సిద్ధమైనట్లేనని చెబుతున్నారు. రామాయణం లాంటి కథకు త్రివిక్రమ్ ఎలాంటి టచ్ ఇచ్చాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాదిలోనైనా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందేమో చూడాలి!
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!