‘ఎన్టీఆర్ 30’ కి త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఏడాది అల్లు అర్జున్ తో చేసిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పలు ‘బాహుబలి1’ రికార్డులను కూడా కొల్లగొట్టింది. ఈ చిత్రం కథ పాతదే అయినప్పటికీ.. ఈ స్టార్ డైరెక్టర్ సినిమాల పై ఉన్న క్రేజ్ తో బ్లాక్ బస్టర్ అయ్యిందనే చెప్పొచ్చు. త్రివిక్రమ్ తన తరువాతి చిత్రాన్ని .. ఎన్టీఆర్ తో చెయ్యబోతున్న సంగతి కూడా తెలిసిందే.

అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి గాను త్రివిక్రమ్ 20 కోట్ల వరకూ పారితోషికం అందుకుంటున్నాడట. చెప్పాలంటే ఇది స్టార్ హీరోలతో సమానమైన పారితోషికం అనే చెప్పాలి. ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రం నుండీ త్రివిక్రమ్ .. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్లోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. త్రివిక్రమ్ ఈ మధ్యన తెరకెక్కించిన సినిమాలలో ఒక్క ‘అజ్ఞాతవాసి’ తప్ప అన్నీ 100ల కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. ఇది త్రివిక్రమ్ కు హోమ్ బ్యానర్ లాంటిది అన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఎన్టీఆర్ తో చెయ్యబోతున్న చిత్రానికి ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ అధినేత కళ్యాణ్ రామ్ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.ఇది పూర్తిగా పొలిటికల్ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తుంది.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus