బుల్లితెరపై హాట్ యాంకర్ గా దూసుకుపోతుంది అనసూయ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఓ పక్క బుల్లితెరపై టీవీ షోలతో బిజీగా గడుపుతూనే.. మరోపక్క వెండితెరపై అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. తెలుగులో కాకుండా తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా ఆమె ఆఫర్లు వస్తున్నాయి. రీసెంట్ గా ఈ బ్యూటీ ‘పుష్ప’ సినిమాలో కనిపించింది. దాక్షాయణి పాత్రలో ఆమె పెర్ఫార్మన్స్ చాలా వైల్డ్ గా అనిపిస్తుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే.
తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో పలు వివాదాల్లో కూడా చిక్కుకుంటూ ఉంటుంది. ఆమెని నెటిజన్లు ట్రోల్ చేయడం.. దానికి ధీటుగా సమాధానాలు ఇవ్వడం అనసూయకి బాగా అలవాటు. ఇదిలా ఉండగా.. తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా అనసూయ చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. ‘వందేమాతరం’ పాట పాడింది. అందులో తప్పేముంది అంటారా..? జాతీయ గీతాలను పాడే సమయంలో మనం లేచి నిల్చొని పాడతాం.
అనసూయ అలా చేయకుండా కూర్చొని పాడేసరికి నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అలానే అనసూయ వేసుకున్న టీ-షర్ట్ పై గాంధీ బొమ్మ ఉండడం చాలా మందికి నచ్చలేదు. ఎందుకంటే ‘రిపబ్లిక్ డే’ అంటే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలులోకి వచ్చినరోజు. దీంతో రాజ్యాంగానికి గాంధీకి సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ కామెంట్స్ పై స్పందించిన అనసూయ.. ‘నేను సారీ చెబుతున్నా.. ఇదంతా చూస్తుంటే నేను నిల్చోకుండా పాడినందుకు చాలా మంది హర్ట్ అయినట్లు ఉన్నారు’ అని చెప్పింది. గాంధీ బొమ్మ టీ షర్ట్పై వచ్చిన కామెంట్స్ పై మండిపడింది.