విష్ణు మంచు హీరోగా ‘కన్నప్ప’ (Kannappa) అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో మంచు విష్ణుతో (Manchu Vishnu) పాటు మోహన్ లాల్ (Mohanlal) , శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar), అక్షయ్ కుమార్ (Akshay Kumar) వంటి స్టార్స్ నటిస్తున్నారు. వీళ్ళకంటే ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కూడా ఈ సినిమా చిన్న పాత్ర పోషిస్తున్నాడు. అందువల్ల ‘కన్నప్ప’ పై ఆడియన్స్ ఫోకస్ పడింది. ఈ సినిమా రెగ్యులర్ గా వార్తల్లో నిలవడానికి అదే కారణం అని చెప్పాలి.
ఇదిలా ఉండగా.. కొన్నాళ్ల నుండి ‘కన్నప్ప’ సినిమాకి సంబంధించి ప్రతి సోమవారం ఒక అప్డేట్ వదులుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు పార్వతీదేవి పాత్ర పోషిస్తున్న కాజల్ (Kajal Aggarwal) లుక్ ని వదిలారు. ‘ముల్లోకాలను ఏలే తల్లి.. భక్తుల్ని ఆదుకునే త్రిశక్తి.. శ్రీకాళహస్తిలో వెలసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక’ అంటూ పార్వతీ మాతను విశ్లేషిస్తూ కాజల్ అగర్వాల్ లుక్ ని వదిలారు. అయితే దీనిపై మిశ్రమ స్పందన వస్తుంది. ఈ లుక్ లో కాజల్ కొత్తగా ఏమీ కనిపించడం లేదు.
పైగా బ్యాక్ గ్రౌండ్లో వాడిన గ్రాఫిక్స్ కూడా చాలా పేలవంగా ఉన్నాయి. అంతేకాదు ‘కాజల్ కంటే నయనతార (Nayanthara) ఈ పాత్రకి బాగా సెట్ అయ్యేది’ అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. వాళ్ళు ఇలా అనడానికి కారణాలు లేకపోలేదు. ‘కన్నప్ప’ ప్రాజెక్టు మొదలైన కొత్తలో పార్వతీ దేవి పాత్ర కోసం నయనతారని సంప్రదిస్తున్నారు అనే వార్త బయటకు వచ్చింది. కానీ తర్వాత ఆమె ప్లేస్లో కాజల్ ను ఫైనల్ చేసినట్లు ప్రచారం జరిగింది.
నయన్ ఈ ప్రాజెక్టు నుండి ఎందుకు తప్పుకుంది? అనే విషయం పై క్లారిటీ రాలేదు. ఇన్సైడ్ టాక్ ప్రకారం..ఈ సినిమా కోసం నయన్ ఏకంగా రూ.10 కోట్లు పారితోషికం కోరిందని.. అందుకే ఆమెను వద్దనుకుని కాజల్ ని తీసుకున్నట్లు టాక్ వినిపించింది.కాజల్ కి ఇప్పుడు అవకాశాలు ఎక్కువ లేవు. పైగా ‘మోసగాళ్ళు’ (Mosagallu) టైంలో విష్ణుతో ఆమెకు స్నేహం ఏర్పడింది. అందుకే కాజల్ ని విష్ణు లాక్ చేసినట్టు స్పష్టమవుతుంది.