Pushpa 2: ‘పుష్ప 2 ‘ సాంగ్ ప్రోమో.. ట్రోలింగ్ ను ఆశించే ఇలా..!

అల్లు అర్జున్ (Allu Arjun)  కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘పుష్ప 2 ‘ (Pushpa 2: The Rule)  సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా నార్త్ లో ఈ సీక్వెల్ గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. సుకుమార్ (Sukumar)  దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా రూ.1000 కోట్ల బిజినెస్ చేస్తున్నట్టు ట్రేడ్ సర్కిల్స్ కూడా కోడై కూస్తున్నాయి.

అది పక్కన పెడితే.. ఆగస్టు 15 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. అలాగే ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన ప్రోమోని నిన్న విడుదల చేశారు. ‘పుష్ప పుష్ప పుష్ప పుష్ప.. పుష్పరాజ్’ అంటూ ఈ పాట సాగుతున్నట్టు ప్రోమో ఉంది. కానీ ఈ ప్రోమోకి నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి. సోషల్ మీడియాలో అయితే నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు.

అయితే ఫుల్ సాంగ్ వచ్చాక అభిప్రాయం మారుతుంది అనే నమ్మకం మేకర్స్ లో గట్టిగా కనిపిస్తుంది. దీనిని బట్టి చూస్తుంటే.. కావాలనే ‘పుష్ప 2 ‘ ఫస్ట్ సింగిల్ ప్రోమోని ఇలా కట్ చేసినట్టు స్పష్టమవుతుంది. సుకుమార్- దేవి శ్రీ ప్రసాద్ (DSP) కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయేమో కానీ మ్యూజిక్ పరంగా ఫెయిల్ అయ్యింది లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus