టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీ దాసరి కిరణ్ కుమార్ గారికి ఘనంగా జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమం

  • February 1, 2023 / 05:15 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నియమితుమైన దాసరి కిరణ్ కుమార్ గారికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. దాసరి కిరణ్ కుమార్ టిటిడి బోర్డు మెంబర్‌ అయిన సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్‌ అధ్యక్షతన తెనాలిలో ఘనంగా ఈ వేడుక జరిగింది. మంత్రి మేరుగు నాగార్జున, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు, బాపట్ల ఎంపి నందిగామ సురేశ్‌, సినీ దర్శకులు బాబి కొల్లి, త్రినాధరావు, మిత్రులు, అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారికి, ఎంపీ బాలశౌరి గారికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఇది ఒక పదవి లా కాదు.. శ్రీవారికి సేవ చేసుకునే భాగ్యం శ్రీ జగన్ మోహన్ రెడ్డి రూపంలో దేవుడు నాకు ఇచ్చాడని భావిస్తున్నాను. శివన్నది చాలా మంచి మనసు. నాకు ఎంతో ఆప్తులు. ఆయన అద్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం జరగడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మంత్రి నాగార్జున అన్న ఈ వేడుకకు రావడం గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. అలాగే రమణ గారు, నందిగామ సురేష్ గారితో పాటు అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు.

అన్నాబత్తుని శివకుమార్‌ మాట్లాడుతూ– ‘‘కిరణ్‌ నాకు ఎంతో ఆప్తుడు. టీటీడీ పాలక మండలి సభ్యుడు కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. స్వామి వారి దర్శన భాగ్యాన్ని కల్పించే అవకాశం కిరణ్ కి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. కిరణ్ కి ఇది సముచిత గౌరవం. ఆ గౌరవానికి వన్నె తెస్తారని కోరుకుంటున్నాను.

మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ..తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నియమితులు కావడం పూర్వజన్మ సుకృతం. అలాంటి పవిత్రమైన భాద్యాత స్వీకరించిన కిరణ్ కి అభినందనలు. కిరణ్ కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. దేవుడి కరుణా కటాక్షాలతోటి కిరణ్ అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలి’’ అన్నారు

ఎంపి నందిగామ సురేశ్‌ మాట్లాడుతూ.. దేవునికి సేవ చేయడానికి జగన్ అన్న ఇచ్చిన అవకాశం చాలా గొప్పది. ఎన్నో పుణ్యాలు చేస్తే ఆ అవకాశం వచ్చింది. కిరణ్ గారికి వున్న మంచితనం, సేవా గుణం వలనె ఇంత గొప్ప అవకాశం వచ్చింది. రానున్న రోజుల్లో మరిన్ని వున్నత శిఖరాలని అవరోధించాలి’’ అన్నారు.

మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ– ‘‘ కిరణ్‌లాంటి మంచి మనిషికి దేవుని సేవ చేసుకునే అదృష్టం కలగటం చాలా ఆనందంగా ఉంది. కిరణ్ కి ఇది చాలా మంచి అవకాశం. తన శక్తివంచన లేకుండా కృషిచేయాలని ఒక అన్నగా కోరుకుంటున్నా ’’ అన్నారు.

దర్శకుడు బాబి మాట్లాడుతూ–‘‘ నేను చిరంజీవి అభిమానిగా ఉన్నప్పట్నుంచి దాసరి కిరణ్‌ అన్న నాకు పరిచయం. కిరణ్ అన్న చేసిన కార్యక్రమాములు నాకు తెలుసు. ఎంతో మందికి సాయం చేశారు. ఆ మంచితనమే కిరణన్నని ఈ రోజు ఇంతటి ఉన్నత స్థానంలో నిలబెట్టింది’. కిరణ్ అన్న మరింత వున్నత స్థానానికి వెళ్ళాలి’ అన్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus