కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో చాలా సినిమాలు ల్యాబ్ లోనే ఉండిపోయాయి. అందులో నాని ‘టక్ జగదీష్’ సినిమా ఒకటి. ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయి చాలా రోజులు అవుతుంది కానీ ఇప్పటివరకు రిలీజ్ చేయలేని పరిస్థితి. నాని నటించిన మరో సినిమా ‘శ్యామ్ సింగరాయ్’ కూడా ఈ నెలాఖరుకి షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంటుంది. దీంతో ముందుగా ఏ సినిమా రిలీజ్ చేస్తారని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘టక్ జగదీష్’ సినిమాను ఓటీటీకి ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తేల్చి చెప్పింది చిత్రబృందం. కానీ ఇప్పుడు ఈ విషయంలో పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. దానికి కారణం ఏంటంటే.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన థియేటర్ యాజమాన్యాలు ఏపీలో టికెట్ రేట్ల విషయం ఓ కొలిక్కి వస్తే గానీ థియేటర్లను తెరవకూడదని నిర్ణయించుకున్నారు. దాదాపు అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి. అదే గనుక జరిగితే థియేటర్లు తీర్చుకోవడానికి మరింత సమయం పడుతుంది.
నిజానికి నాని తన సినిమాను ఆగస్టులో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలా లేదు. దీంతో మేకర్లు ఓటీటీ సంస్థలతో మంతనాలు షురూ చేస్తున్నట్లు సమాచారం. మంచి డీల్ సెట్ అయితే గనుక ఓటీటీకి ఇచ్చే ఛాన్స్ ఉందని టాక్. మరేం జరుగుతుందో చూడాలి!
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్