మీలాంటి వాళ్ళ వలనే.. ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది..!

హాట్ యాంకర్ రష్మిగౌతమ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు నెటిజన్లు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇస్తూ అందరితోనూ టచ్ లో ఉంటుంది. అలాగే ఎవరైనా కాస్త ఎటకారంగా కామెంట్ పెడితే దానికి రెండు రెట్లు ఎటకారం నూరిపోసి మరీ కామెంట్లు పెడుతుంది. అయితే తాజాగా తన ట్విట్టర్లో ఓ వ్యక్తి రష్మి దగ్గర అతి తెలివి ప్రదర్శించాడు. ఆ విషయం వెంటనే కనిపెట్టిన రష్మి.. ఆ వ్యక్తికి ఊహించని షాకిచ్చింది.

వివరాల్లోకి వెళితే ఓ యాడ్ షూట్ కోసం మిమ్మల్ని సంప్రదించాలి , మీ నాన్న గారి నెంబర్ మిస్ అయ్యింది, ఒకసారి మీ నాన్నగారి నెంబర్ ఇవ్వమని కోరాడు. దీనికి రష్మి బదులిస్తూ… ”నాకు పన్నెండేళ్ళ వయసున్నప్పుడే మా నాన్న చనిపోయారు. కాబట్టి మా నాన్న నెంబర్ నీ దగ్గర ఉండే ఛాన్స్ అస్సలు లేదు. ఇలా పీఆర్ మేనేజ్మెంట్ పేరుతో ఇతరులను ఫూల్ చేయాలని ప్రయత్నించకు. అమ్మాయిలతో మాట్లాడడానికి ఇదొక వంక అని నాకు తెలుసు. మీలాంటి వాళ్ళ వలెనే ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోంది” అంటూ ఆ నెటిజెన్ కి షాకిచ్చింది. అయితే రష్మి ఫాలోవర్స్ మాత్రం ఇలాంటి విషయాలపై స్పందించకూడదని రష్మికి సలహాలు ఇస్తుంటే… స్పందించాల్సిన బాధ్యత నా పై ఉంది అంటూ వివరణ ఇచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus