కుర్ర హీరో ఫోన్ ఎత్తికెళ్లిన దుండగులు!

సినిమాల్లో దొంగతనాలు చేసే వారిని పట్టుకొని హీరోలు చితకబాదుతుంటారు. కానీ నిజ జీవితంలో వారికి నిజంగానే దొంగలు ఎదురైతే అందరిలానే వారు కూడా భయపడి, అడిగింది ఇచ్చేస్తుంటారు. ఇలాంటి అనుభవమే ఓ యంగ్ హీరోకి ఎదురైంది. సీనియర్ హీరో కార్తిక్ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ గౌతమ్ కార్తిక్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. మణిరత్నం రూపొందించిన ‘కడలి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ప్రస్తుతం ‘నవరస’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఈ నెల 2న చెన్నైలోని టీటీకే రాడ్ లో సైకిల్ మీద వెళ్తున్న గౌతమ్ ని ఇద్దరు వ్యక్తులు వచ్చి అడ్డగించారు. అతడిని బెదిరించి విలువైన సామ్ సంగ్ ఫోన్ ను ఎత్తుకెళ్లారు. పగటి సమయంలో అది కూడా రద్దీగా ఉండే రోడ్డులో హీరోని దోపిడీ చేయడంతో పోలీసులు కాస్త కష్టపడాల్సి వచ్చింది. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో శరత్ అనే వ్యక్తితో పాటు అతడికి సహకరించిన 17 ఏళ్ల మైనర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ ఇద్దరితో పాటు వీరిద్దరి నుండి ఫోన్ ని కొనుగులో చేసిన ఫైరూజ్ ఖాన్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus