Sharwanand: శర్వానంద్‌ కొత్త సినిమా… హీరోయిన్లు వీళ్లేనా?

  • February 1, 2024 / 04:14 PM IST

శర్వానంద్ నుండి సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది తెలుసా? కచ్చితంగా చెప్పాలంటే 16 నెలలు దాటిపోయింది. అయితే ఆ తర్వాత ఏ సినిమా చేస్తున్నాడు అనే విషయంలో ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. అయితే శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు అనే పుకారు అయితే ఉంది. అంతేకాదు ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయిపోయిందట. దీంతో తర్వాతి సినిమాను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు అంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌ రూమర్‌ ఆ సినిమా హీరోయిన్ల గురించే.

ఇప్పుడు చేస్తున్న సినిమా ఏంటో చెప్పకుండా తర్వాతి సినిమా గురించి చెప్పడం ఏంటి అనుకుంటున్నారా? చెప్పలేం ఎందుకు ఆ సినిమా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది కాబట్టి. ఏదైనా సినిమా గుమ్మడికాయ కొట్టేంతవరకు కొబ్బరికాయ కొట్టారు అనే విషయం బయటకు చెప్పకపోవడం వాళ్ల ప్లాన్‌. ఇప్పటివరకు ఇలానే చేశారు. ఒక్క ‘బ్రో’ సినిమా తప్ప. అలా శ్రీరామ్‌ ఆదిత్య సినిమా సంగతి ఇప్పుడు అయితే చెప్పలేం. త్వరలో రిలీజ్‌ అంటున్నారు అప్పుడు తెలుస్తుంది లెండి.

ఈ సినిమా తర్వాత శర్వానంద్‌ (Sharwanand) ‘సామజవరగమన’ దర్శకుడు రామ్‌ అబ్బరాజుతో కలసి పని చేయనున్నాడు అని టాక్‌. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించనున్న ఈ సినిమా రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని అంటున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా కోసం ఇద్దరు కథానాయికల్ని ఎంపిక చేసే పనిలో టీమ్‌ ఉంది. దీని కోసం సంయుక్త, సాక్షి వైద్య పేర్లను పరిశీలిస్తున్నట్లు సోషల్‌ మీడియా వర్గాల సమాచారం. ఇప్పటికే సినిమా టీమ్స్‌ వాళ్లతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

ఇక శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే రామ్‌ అబ్బరాజు సినిమా ఉంటుంది అంటున్నారు. అయితే ఇటీవల కాలంలో కొత్త సినిమాలేవీ సంయుక్త ఒప్పుకోవడం లేదు. పెళ్లి చేసుకుంటోంది అని అన్నారు. మరి ఈ సినిమాను ఓకే చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఓకే చేస్తే పెళ్లి పుకార్లు కేవలం పుకార్లుగానే ఉండిపోతాయి అని చెప్పొచ్చు. ఇక సాక్షి అయితే ప్రస్తుతం తనను తాను నిరూపించుకునే పనిలో ఉంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus