Shruti Hassan: ఆ రికార్డులు శృతి హాసన్ కు మాత్రమే సొంతమా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణలకు జోడీగా శృతి హాసన్ నటిస్తున్నారు. ఒకవైపు ప్రభాస్ కు జోడీగా నటిస్తూనే మరోవైపు సీనియర్ హీరోలకు జోడీగా శృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ శృతి హాసన్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఈ హీరోయిన్ పేరుపై రెండు అరుదైన రికార్డులు ఉన్నాయి. బాలనటిగా పలు సినిమాల్లో మెరిసిన శృతి హాసన్ నటి కావడంతో పాటు సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా అనే సంగతి తెలిసిందే.

ఈ హీరోయిన్ ఎన్టీఆర్ తో కలిసి రామయ్యా వస్తావయ్యా అనే సినిమాలో నటించారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. అయితే శృతి హాసన్ రామయ్యా వస్తావయ్యా పేరుతో హిందీలో కూడా ఒక సినిమాలో నటించారు. ఈ విధంగా శృతి హాసన్ ఒక రేర్ రికార్డును సొంతం చేసుకున్నారు. తెలుగు రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్ అయినా హిందీ రామయ్యా వస్తావయ్యా మాత్రం హిట్ అయింది.

మరోవైపు శృతి హాసన్ నటించిన డి డే, రామయ్యా వస్తావయ్యా సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. ఈ విధంగా కూడా శృతి హసన్ మరో రేర్ రికార్డును సాధించారు. ఇలా శృతి కెరీర్ లో రెండు అరుదైన రికార్డులు చేరాయి. శృతి హాసన్ తన సినీ కెరీర్ లో అన్నిరకాల పాత్రలను పోషించారు. టాలెంటెడ్ హీరోయిన్ అయిన శృతి హాసన్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సింపుల్ గా జీవించడానికి ఇష్టపడే హీరోయిన్లలో శృతి ఒకరు.

అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ముచ్చటించే శృతి ఎన్నో విషయాలను ఫ్యాన్స్ కు వెల్లడిస్తున్నారు. తాజాగా శృతి పుట్టినరోజు జరుపుకోగా ఆమె మరెన్నో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus