2017లో ఖైదీ 150 చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తమిళ చిత్రం కత్తి సినిమాకు తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ మూవీలో చిరంజీవి చాలా కాలం తరువాత డ్యూయల్ రోల్ చేయగా వి వి వినాయక్ తెరకెక్కించారు. కమ్ బ్యాక్ తరువాత వరుసగా సినిమాలు చేస్తున్న చిరు గత ఏడాది సైరా అనే భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేశారు. పాన్ ఇండియా చిత్రంగా పలు భాషలలో విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.
చిరు తన 152వ చిత్రం టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో చేస్తున్నారు. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే ఆయన తన నెక్స్ట్ మూవీపై కూడా ఫోకస్ పెట్టారు. మోహన్ లాల్ హీరోగా మలయాళంలో విడుదలై సూపర్ హిట్ అందుకున్న పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్ తెలుగు రీమేక్ లో ఆయన నటించనున్నారు. సాహో చిత్ర దర్శకుడు సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా, ఆ స్క్రిప్ట్ కి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్కుపులు చేర్పులు చేస్తున్నారు.
కాగా ఈ మూవీలో మోహన్ లాల్ చేస్తున్న పాత్ర చిరంజీవి చేస్తున్నారు. ఐతే మలయాళంలో మోహన్ లాల్ పాత్రకు హీరోయిన్ ఉండదు. మరి చిరు ఇమేజ్, కమర్షియల్ అంశాల దృష్ట్యా హీరోయిన్ పెట్టాలి, కానీ పాత్రకు హీరోయిన్ ని తీసుకోవడం కుదరని నేపథ్యంలో సుజీత్ రెండు ఐటెం సాంగ్స్ మూవీలో పెట్టే ఆలోచనలో ఉన్నారట. సినిమా ఫస్ట్ హాఫ్ లో ఒకటి, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కి ముందు మరొక సాంగ్ పెట్టాలని చూస్తున్నారట. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
Most Recommended Video
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!