Hero Nani: ‘శ్యామ్ సింగరాయ్’ రైట్స్ ఎవరికి దక్కుతాయో..?

నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయం పోషించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా గతేడాది క్రిస్మస్ కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. సూపర్ హిట్ అయిన ఈ సినిమా అదే రేంజ్ లో కలెక్షన్స్ ను సాధించింది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా సినిమాకి హిట్ టాక్ వచ్చింది. థియేటర్లో సందడి చేసిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీలో విడుదలై అక్కడ కూడా రికార్డులు కొల్లగొట్టింది.

ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ అమ్మాలనే.. హిందీలో డబ్ చేయలేదు. ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవుతుందనే విషయాన్ని ప్రమోషన్స్ సమయంలో నాని స్వయంగా వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ రైట్స్ కోసం బాలీవుడ్ హీరోలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు సినిమాలను రీమేక్ చేసి మంచి హిట్స్ అందుకుంటున్న హీరో షాహిద్ కపూర్ దృష్టి ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ్’పై పడిందట.

ఆయనే స్వయంగా సినిమా రీమేక్ హక్కులను కొనాలని చూస్తున్నారు. నాని నటించిన ‘జెర్సీ’ సినిమా రీమేక్ లో కూడా షాహిద్ కపూరే నటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. షాహిద్ తో పాటు మరో స్టార్ హీరో కూడా ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అతడు మరెవరో కాదు.. అజయ్ దేవగన్. యాక్షన్ కథలను ఇష్టపడే అజయ్ దేవగన్ ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా రీమేక్ చేస్తే డిఫరెంట్ గా ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు సినిమా హక్కులను దక్కించుకోవాలని చూస్తున్నారు. మరి వీరిద్దరిలో సినిమా హక్కులు ఎవరికి దక్కుతాయో చూడాలి!

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus