సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, బ్రేకప్ లు చాలా కామన్. ఇక బాలీవుడ్ లో నటీనటులు ప్రేమలో పడడం.. విడిపోవడం జరుగుతూనే ఉంటుంది. ఇదిలా ఉండగా ప్రముఖ నటి నర్గీస్ ఫక్రీ గతంలో హీరో ఉదయ్ చోప్రాతో ఐదేళ్లు ప్రేమలో ఉన్న విషయాన్ని తాజాగా కన్ఫర్మ్ చేసింది. ఇటీవల నర్గీస్ నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఉదయ్ చోప్రాతో ఐదేళ్లు డేటింగ్ లో ఉన్నట్లు చెప్పింది. ఇండియాలో తను కలిసిన వ్యక్తుల్లో అందరిలో అతడు చాలా మంచివాడని తెలిపింది.
‘మీ రిలేషన్షిప్ గురించి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించగా..?’.. ‘సోషల్ మీడియా, ఇంటర్నెట్ లో వచ్చే ఫేక్ న్యూస్ ల వలన ఇబ్బంది పడాల్సి వస్తుందని.. అందుకే తమ అనుబంధం గురించి బయట ప్రపంచానికి వెల్లడించొద్దని తనతో చాలా మంది చెప్పారని.. ఆ కారణంగానే బయటకు తెలియనివ్వలేదని పేర్కొంది. అయితే రిలేషన్షిప్ లో ఉన్న సమయంలో మాత్రం వారిద్దరూ కేవలం స్నేహితులని మాత్రమే చెప్పుకునేవారు.
కానీ మధ్యలో మాత్రం ఉదయ్-నర్గీస్ సహజీవనం చేస్తున్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచంరా జరిగింది. 2016లో వీరిద్దరికి బ్రేకప్ అయిందంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!