Uday Kiran, Balakrishna: ఉదయ్ కిరణ్ బాలయ్య కాంబినేషన్లో రావలసిన సినిమా ఏంటో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ఉదయ్ కిరణ్ ఒకరు. ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఉదయ్ కిరణ్ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.అయితే ఇంత తొందరగా ఎంత్ ఎత్తుకు ఎదిగారో అంతే తొందరగా ఈయన ఈ లోకం విడిచి వెళ్లిపోయారని చెప్పాలి. ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలన్నీ క్రమక్రమంగా ఫ్లాప్ కావడంతో ఈయనకు అవకాశాలు తగ్గిపోయాయి.

ఇలా అవకాశాలు తగ్గిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఈయన ఆత్మహత్య చేసుకుని చనిపోయిన సంఘటన అందరికీ తెలిసిందే. ఇప్పటికి ఉదయ్ కిరణ్ లేరనే వార్త అభిమానులను ఎంతగానో కలిచి వేస్తుంది. ఇకపోతే ఉదయ్ కిరణ్ నందమూరి బాలయ్య ఇద్దరు కలిసి ఓ సినిమా కోసం పని చేశారనే విషయం చాలా మందికి తెలియదు. మరి వీరిద్దరూ కలిసి నటించిన ఆ సినిమా ఏంటి అని విషయానికి వస్తే…

బాలకృష్ణ నటించిన నర్తనశాల సినిమాలో ఉదయ్ కిరణ్ కు నటించే అవకాశం వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ సమయానికి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2004 మార్చి నెలలో రామోజీ ఫిలిం సిటీలో వేసిన పర్ణశాల సెట్ లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా దివంగత నటి సౌందర్య హీరోయిన్గా నటించారు. ఇక ఈ సినిమాలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ను అభిమన్యుడి పాత్ర కోసం తీసుకున్నారు.

ఈ క్రమంలోనే ఈ షూటింగ్ లొకేషన్లో బాలకృష్ణ (Uday Kiran) ఉదయ్ కిరణ్ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది. సౌందర్య అకాల మరణంతో ఈ సినిమా షూటింగ్ అక్కడికే ఆగిపోయింది. పరిస్థితులన్నీ అనుకూలించి ఉంటే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. ప్రస్తుతం ఈ ఫోటోలో చూసిన అభిమానులు ఉదయ్ కిరణ్ ను తలుచుకొని కంటతడి పెట్టుకుంటున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus