‘చిత్రం’ ‘నువ్వు నేను’ ‘మనసంతా నువ్వే’ వంటి వరుస హిట్లతో స్టార్ హీరో అయిపోయాడు ఉదయ్ కిరణ్. ఆ తరువాత వచ్చిన ‘కలుసుకోవాలని’ ‘శ్రీరామ్’ ‘నీ స్నేహం’ వంటి చిత్రాలు కూడా బానే ఆడాయి. మహేష్ బాబు, ప్రభాస్ ల కంటే ముందే స్టార్ హీరో అయిపోయాడు ఉదయ్ కిరణ్. కానీ 2003 తరువాత ఉదయ్ కిరణ్ సినిమాలు వరుసగా ప్లాప్ లు అవుతూ వచ్చాయి. సడెన్ గా అతని కెరీర్ డౌన్ అయిపోయింది.
ఎందుకు అలా జరిగిందో ఎవ్వరికీ అర్ధం కాలేదు.మధ్యలో ‘నీకు నేను నాకు నువ్వు’, ‘గుండె ఝల్లుమంది’ వంటి చిత్రాలు పర్వాలేదు అనిపించినా.. అతనికి కలిసొచ్చిందేమి లేదు. అయితే అతను చెయ్యాల్సిన కొన్ని సినిమాలు మధ్యలో ఆగిపోయాయి. అయితే ఇతను చివరిగా నటించిన ‘చిత్రం చెప్పిన కథ’ ఇంకా రిలీజ్ కాలేదు. ఈ చిత్రం కచ్చితంగా తనకు మంచి హిట్ ఇస్తుంది అని ఉదయ్ కిరణ్ ఓ సందర్భంలో తెలిపాడు. అయితే ఆ సినిమా ఏందో విడుదల కాలేదు.
ఇక ఇన్నాళ్టికి ఓటిటిలో విడుదలయ్యింది. ఈ చిత్రాన్ని 3 కోట్లకు .. ప్రముఖ ఓటిటి సంస్థ కొనుగోలు చేసిందట. చెప్పాలంటే.. ఇది మంచి రేటు అనే చెప్పాలి. ఇప్పుడు ‘నెపోటిజం’ అనే అంశం ట్రేండింగ్ లో ఉంది కాబట్టి.. ఉదయ్ కిరణ్ ఆఖరి చిత్రం ఎక్కువ మంది చూసే ఛాన్స్ కూడా ఉందని చెప్పొచ్చు.