వైరల్ అవుతున్న సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు పెళ్లి ఫోటోలు..!

ఈ లాక్ డౌన్ టైములో చాలా మంది సినీ సెలబ్రిటీల పెళ్లిళ్లు జరిగాయి. అయితే కొంతమంది ప్రేక్షకులకు ఈ విషయాన్ని తెలియజేసి పెళ్లి చేసుకున్నారు. మరికొంతమంది అయితే పెళ్లి చేసుకున్నాక ఈ విషయాన్ని వారి సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ హీరోయిన్ షాలిని,’మేము వయసుకు వచ్చాం’ హీరోయిన్ నీతి టైలర్, ‘మిస్టర్ నూకయ్య’ హీరోయిన్ సనా ఖాన్ వంటి వారు ఈ లిస్ట్ లో ఉన్నారు. ఇప్పుడు మరో సెలబ్రిటీ కూడా ఈ లిస్ట్ లో చేరినట్టు తెలుస్తుంది.

తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన గాయకుడు ఉదిత్ నారాయణ కొడుకు ఆదిత్య నారాయణ ఇటీవల సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడట. తన చిన్ననాటి మిత్రురాలు శ్వేత అగర్వాల్ ను.. ఆదిత్య వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. గతేడాది వరకూ ఆదిత్య.. మరో గాయని నేహ కక్కర్ తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.అయితే అవన్నీ పుకార్లే అని తేలిపోయింది.ఎందుకంటే.. నేహా కూడా ఇటీవలే వివాహం చేసుకుని… ప్రస్తుతం తన భర్తతో కలిసి హనీమూన్ ను ఎంజాయ్ చేస్తుంది.

ఇక ఆదిత్య,శ్వేత ల ప్రేమ వ్యవహారం ఈ మధ్యనే వీరి కుటుంబసభ్యులతో తెలిపారట. వారు కూడా వీరి పెళ్ళికి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తుంది. కరోనా నియమాలను పాటిస్తూనే వీరి వివాహం నిరాడంభరంగా జరిగినట్టు తెలుస్తుంది. వీరి పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus