ఓటిటి లో సూపర్ హిట్.. సత్య దేవ్ సినిమాకి భారీ రేటు..!

ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రం ఓటిటిలో విడుదలైనప్పటికీ సూపర్ హిట్ అయ్యింది. ‘కేరాఫ్ కంచెరపాలెం’ అనే చిత్రాన్ని తెరకెక్కించి క్లాసిక్ గా నిలబెట్టిన వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకుడు. ఇది మలయాళం రీమేక్ అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చాలా అద్భుతంగా తెరకెక్కించాడు ఈ యంగ్ డైరెక్టర్. సినిమా థియేటర్లు మూతపడటంతో ఈ చిత్రాన్ని నేరుగా నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు.

అయినప్పటికీ ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుంది. సహజత్వంతో కూడిన కథనం.. అద్భుతమైన సంగీతం సినిమాని సూపర్ హిట్ గా నిలబెట్టాయి. ఓటిటిలో ఈ చిత్రానికి రోజు రోజుకీ ఆదరణ పెరుగుతుంది. నిర్మాతలు ఆల్రెడీ సేఫ్ అయిపోయారు. సినిమాకి మంచి టాక్ రావడంతో శాటిలైట్ రైట్స్ కు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రం శాటిలైట్ రైట్స్ ను 2.2 కోట్లకు ఈటీవీ వారు సొంతం చేసుకున్నారట.

వీలైనంత త్వరగా ప్రీమియర్ ను టెలికాస్ట్ చెయ్యాలని వారు భావిస్తున్నట్టు సమాచారం.అటు ఓటిటిలో సూపర్ హిట్ అవ్వడంతో నిర్మాతలు ఆల్రెడీ సేఫ్ అయ్యారు.ఇక శాటిలైట్ రైట్స్ కూడా మంచి రేటుకి అమ్ముడు పోవడంతో.. వారికి మంచి లాభాలు దక్కాయనే చెప్పాలి. చాలా రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సత్యదేవ్ కు కూడా మంచి హిట్ దక్కినట్టు అయ్యింది.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus