Balakrishna, Allu Arjun, Mahesh: బాలకృష్ణ, బన్నీ, మహేష్ ల స్ట్రాటజీ… సేమ్ అండ్ సేఫ్..!

అనుకోకుండా మన టాలీవుడ్ స్టార్ హీరోలైన బాలకృష్ణ,మహేష్ బాబు,అల్లు అర్జున్ లు ఒకే రూట్లో వెళ్తున్నారు. దాంతో అది ‘సేమ్ అండ్ సేఫ్’ అనే కామెంట్స్ మొదలయ్యాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ ముగ్గురు హీరోలు కూడా.. గతంలో చేసిన దర్శకులతో మూడో సినిమా చేస్తున్నారట. బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరెక్షన్లో ‘అఖండ’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్.. సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ అనే చిత్రం చేస్తున్నాడు. మహేష్ విషయానికి వస్తే త్రివిక్రమ్ డైరెక్షన్లో మూడో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

అయితే బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో గతంలో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ లు కొట్టాయి. ‘సింహా’ ‘లెజెండ్’ చిత్రాలు ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టు బాలయ్య కెరీర్లో రికార్డుల మోత మోగించాయి. కాబట్టి వీరి కాంబినేషన్ అంటే జనాల్లో బీభత్సమైన క్రేజ్ నెలకొంది. అందుకే ‘అఖండ’ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బన్నీ, మహేష్ లకు రెండో సారి సక్సెస్ లభించలేదు. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్య’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది కానీ ‘ఆర్య2’ ఆడలేదు.

అయినప్పటికీ ఈ కాంబోకి మంచి క్రేజ్ ఉంది. అందుకే ‘పుష్ప’ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ‘అతడు’ హిట్ అయ్యింది. కానీ తర్వాత వచ్చిన ‘ఖలేజా’ డిజాస్టర్ అయ్యింది. కానీ వీరి కాంబినేషన్ అనేసరికి అంచనాలు భారీగానే నెలకొన్నాయి. వీరి కాంబినేషన్లో రాబోతున్న మూడో చిత్రం గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus