Allari Movie: 21 ఏళ్ళ ‘అల్లరి’ మూవీ గురించి ఎవ్వరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు..!

  • May 11, 2023 / 12:42 PM IST

ఇవివి సత్యనారాయణ గారి చిన్నబ్బాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు నరేష్. 2002 వ సంవత్సరంలో రవిబాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల్లరి’. ఈ చిత్రంతోనే డైరెక్టర్ గా రవిబాబు, హీరోగా నరేష్ ఎంట్రీ ఇచ్చారు. 2002 మే 10 న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 21 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో #21YearsOfAllariNaresh , #21YearsOfAllari అనే హ్యాష్ ట్యాగ్ లు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ‘అల్లరి’ చిత్రం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి.

1) ‘అల్లరి’ (Allari) చిత్రాన్ని రవిబాబు ‘ఫ్లైయింగ్ ఫ్రాగ్స్’ అనే బ్యానర్ ను స్థాపించి ఓ చిన్న సినిమాగా తీయాలనుకున్నారట. ముందుగా ఈ లైన్ ను తన స్నేహితుడు సురేష్ బాబుకి వినిపించాడు. అయితే ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై పెద్ద సినిమాలు నిర్మిస్తున్నారు. ఆ టైంలో చిన్న సినిమా ఎందుకా అని సురేష్ బాబు ఆలోచనలో పడ్డారు. అయినా రవిబాబు కాన్ఫిడెన్స్ పై నమ్మకంతో రవిబాబుకి సపోర్ట్ ఇచ్చి ‘ఫ్లైయింగ్ ఫ్రాగ్స్’ అనే బ్యానర్ ను స్థాపించేలా చేశారు.

2) అయితే రవిబాబు .. మొదటి సినిమాకే నిర్మాణ రంగంలోకి వెళ్లడం కరెక్టేనా అనే ఆలోచన వచ్చింది. అదే విషయాన్ని తన తండ్రి చలపతి రావుకి చెప్పగా.. ఆయన ‘మన సినిమా ఎవ్వడూ కొనడు. కాబట్టి మనం సురేష్ బాబు, రామానాయుడు ల సపోర్ట్ తీసుకుని వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్టర్ ను వాడుకుందాం అని చెప్పారట. తండ్రి మాటలతో రవిబాబు కూడా కన్విన్స్ అయ్యాడు.

3) అంతేకాదు రవిబాబుకి సురేష్ బాబు ఓ మాట కూడా చెప్పారు. ఈ సినిమాని నువ్వు డైరెక్టర్ గా మాత్రమే చేస్తే సరిపోదు.. నువ్వు నిర్మాణ భాగస్వామిగా ఫీలయ్యి చెయ్యి. అప్పుడే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పారట.

4) అందుకు జనాలకు తెలీని ఫేస్ ఒకటి కావాలని భావించి నరేష్ ను సంప్రదించాడు. ఇవివి సత్యనారాయణ వద్ద రవిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అల్లరి నరేష్ కూడా వాళ్ళ నాన్నగారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈ క్రమంలో రవిబాబుకి, అల్లరి నరేష్ కు ఫ్రెండ్ షిప్ ఏర్పడింది.

5) ఆ ఫ్రెండ్ షిప్ వల్లనే నరేష్ ను రవిబాబు అప్రోచ్ అవ్వడం జరిగింది. నిజానికి నరేష్ కు హీరోగా చేయాలనే ఇంట్రెస్ట్ లేదు.తన తండ్రిలానే డైరెక్టర్ కావాలనుకున్నాడు. అదే విషయాన్ని ఇవివి గారికి నరేష్ చెప్పడం జరిగింది.

6) అందుకే ఆర్యన్ రాజేష్ సినీ రంగప్రవేశాన్ని గ్రాండ్ గా ప్లాన్ చేసిన ఇవివి గారు.. అల్లరి నరేష్ హీరోగా చేసిన మూవీని పట్టించుకోలేదు.

7) అయినా తండ్రికి నరేష్ ఓ మాట చెప్పాలి కాబట్టి చెప్పారు. రవిబాబు కూడా ఇవివిని ఒప్పించడం జరిగింది. అయితే సినిమా నిండా కొత్త మొహాలే ఉంటే.. మార్కెట్ చేసుకోడానికి ఇబ్బంది అవుతుందేమో ఆలోచించుకోండి అన్నారట. అయినా రవిబాబు భయపడలేదు.

8) మొత్తంగా సినిమా మొదలుపెట్టారు. లక్ష్మీ పతి, తనికెళ్ళ భరణి, చలపతి రావు తప్ప పెద్దగా తెలిసిన క్యాస్టింగ్ సినిమాలో లేదు.

9) 24 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సినిమాలో పాటలన్నీ ఒక్కరోజులోనే ఫినిష్ చేశారు. ఇప్పటికే ఇదొక రికార్డుగా చెప్పుకోవాలి.

10) ఒక అపార్ట్మెంట్లోనే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అనుకున్న బడ్జెట్ లోనే సినిమాని కంప్లీట్ చేసి సురేష్ బాబు చేతిలో పెట్టాడు రవిబాబు.

11) ‘అల్లరి’ సినిమాని రూ.70 లక్షల బడ్జెట్ లో కంప్లీట్ చేశాడట.

12) ఓ పక్క హరికృష్ణ నటించిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సూపర్ హిట్ అయ్యింది. మరోపక్క ‘సంతోషం’ కూడా ఒక్కరోజు ముందు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

13) సహజంగానే ‘అల్లరి’ చిత్రాన్ని కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాలేదు.

14) దాంతో సురేష్ బాబు తన హ్యాండోవర్ లో ఉన్న థియేటర్లలో సినిమాని రిలీజ్ చేశారు. మార్నింగ్ షోలకే మంచి టాక్ వచ్చింది. పాల్ జె సంగీతం కూడా జనాలకు కొత్తగా అనిపించింది.

15) సైలెంట్ గా 15 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది ‘అల్లరి’ చిత్రం. థియేట్రికల్ గానే కాకుండా శాటిలైట్ రైట్స్ తో కూడా కలుపుకుని సురేష్ బాబుకి రూ.2 కోట్ల వరకు తెచ్చిపెట్టింది ఈ చిత్రం.

16) ఇక ఇందులో హీరోయిన్ గా నటించిన శ్వేత అగర్వాల్ కు ప్రభాస్ నటించిన ‘రాఘవేంద్ర’ సినిమాలో ఛాన్స్ లభించింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus