యాక్షన్ కింగ్ అర్జున్, జగపతి బాబు, వేణు కాంబినేషన్లో వచ్చిన ‘హనుమాన్ జంక్షన్’ మూవీని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ చిత్రంలో కామెడీ ఆ రేంజ్లో ఉంటుంది. రెగ్యులర్ గా తెలుగు సినిమాల్లో కనిపించే కామెడీ కాదు ఇది. ఓ కన్ఫ్యూజన్ కామెడీ. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ఎద్దు కామెడీ ఇప్పుడు చూసిన పగలబడి నవ్వే వాళ్ళ సంఖ్య ఎక్కువే ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. నిజానికి ఈ చిత్రం మలయాళంలో రూపొందిన ‘థెన్ కాశి పట్టణం’ అనే చిత్రానికి రీమేక్. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు చాలా చక్కగా ఈ చిత్రాన్ని కొన్ని మార్పులు చేసి చిత్రీకరించాడు దర్శకుడు మోహన్ రాజా. ఒక్కప్పటి ఎడిటర్ అలాగే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అయిన ఎడిటర్ మోహన్ గారి అబ్బాయి ఇతను అన్న సంగతి తెలిసిందే. ‘హనుమాన్ జంక్షన్’ మూవీ 2001 వ సంవత్సరం డిసెంబర్ 21న రిలీజ్ అయ్యింది ఈ చిత్రం రిలీజ్ అయ్యి నేటితో 21 ఏళ్లు పూర్తయింది. ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి :
1) కెరీర్ ప్రారంభంలో తన తండ్రి ఎడిటర్ మోహన్ రాజా గారు రూపొందించిన ‘హిట్లర్’ ‘మనసిచ్చి చూడు’ ‘క్షేమంగా వెళ్ళి లాభంగా రండి’ వంటి చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేసిన మోహన్ రాజా… దర్శకుడిగా మారాలి అని ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు అతనికి ‘నువ్వే కావాలి’ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది. కానీ మోహన్ రాజా అందుకు ఒప్పుకోలేదు. మొదటి సినిమాకి రీమేక్ నే ఎంపిక చేసుకోవాలా అని అతని అభిప్రాయం. అందుకే ‘నువ్వే కావాలి’ చిత్రానికి నొ చెప్పాడు. కానీ కట్ చేస్తే ఆ సినిమాని విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేయడం.. అది ఇండస్ట్రీ హిట్ అవ్వడం జరిగింది.
2) అందుకే రీమేక్ చేయడం అనేది తప్పు అన్నట్లు చూడకూడదు అని అతను ఆ టైంలో గ్రహించాడట. ఆ తర్వాత అతనికి ‘థెన్ కాశి పట్టణం’ అనే చిత్రం రీమేక్ చేసే అవకాశం వస్తే వెంటనే ఓకే చెప్పేశాడట. అదే ‘హనుమాన్ జంక్షన్’.
3) అయితే ఈ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ అర్జున్, జగపతి బాబు కాదు. మొదట ఈ చిత్రాన్ని ఇద్దరు స్టార్ హీరోలతో చేయాలని మోహన్ రాజా అనుకున్నాడట.
4) ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు మోహన్ బాబు, రాజశేఖర్. అర్జున్ పోషించిన కృష్ణ పాత్రను రాజశేఖర్ చేయాలి. జగపతి బాబు పోషించిన దాస్ పాత్రను మోహన్ బాబు చేయాలి.
5) ‘హనుమాన్ జంక్షన్’ కోసం మోహన్ బాబు, రాజశేఖర్ లకు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారట. కానీ మోహన్ రాజా వీరిద్దరి పాత్రల పైనే దృష్టి పెట్టి మిగిలిన కథని గాలికి వదిలేస్తున్నాడు అనే అనుమానం రావడంతో ఎడిటర్ మోహన్ గారు.. ఆ ఇద్దరు స్టార్లు వద్దని చెప్పారట. పర్సనల్ గా వాళ్ళను కలిసి సారి కూడా చెప్పి విరమించుకున్నట్టు తెలుస్తుంది.
6) ఈ చిత్రానికి ’18 పేజెస్’ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ కూడా పనిచేశాడు.
7) ఈ చిత్రంలో హిలేరియస్ అనిపించే ఆవు ఎపిసోడ్ లో వేణు, ఎల్ బి, శ్రీరామ్ నటించలేదు.క్లోజ్ షాట్ లు మాత్రమే వాళ్ళు చేశారు. మిగిలిన అన్ని షాట్లు చేసింది మోహన్ రాజా అసిస్టెంట్లు అయిన గుణ, సూర్య ప్రతాప్ లు నటించారు. 15 రాత్రుల పాటు ఈ ఎపిసోడ్ ను చిత్రీకరించారు.
8) మోహన్ రాజా తమ్ముడు, తమిళ స్టార్ హీరో అయిన ‘జయం’ రవి కూడా ‘హనుమాన్ జంక్షన్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం పనిచేశాడు.
9) ‘హనుమాన్ జంక్షన్’ చిత్రీకరించిన ఇంటినే ఇటీవల వచ్చిన చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రం కోసం కూడా ఉపయోగించారు.
10) ఈ చిత్రాన్ని 74 రోజుల్లో కంప్లీట్ చేశారు. రామచంద్రపురం, హైదరాబాద్, రాజమండ్రి పరిసరాల్లో ఈ చిత్రం షూటింగ్ జరిగింది.
11) ‘థెన్ కాశి పట్టణం’ రీమేక్ రైట్స్ ను ఎడిటర్ మోహన్ గారు రూ.15-20 లక్షలకు కొనుగోలు చేశారు.
12) ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ మూవీ రూ.1 కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది.
13) ఫుల్ రన్లో ఈ మూవీ రూ.7 కోట్ల వరకు షేర్ ను కలెక్ట్ చేసింది.
14) ‘హనుమాన్ జంక్షన్’ హిట్ అయ్యాక.. ‘థెన్ కాశి పట్టణం’ రీమేక్ రైట్స్ ను పలు భాషల్లో రీమేక్ చేశారు కానీ.. అక్కడ సక్సెస్ కాలేదు.