Okkadunnadu: 16 ఏళ్ళ ‘ఒక్కడున్నాడు’ మూవీ గురించి ఆసక్తికర విషయాలు

  • March 3, 2023 / 05:49 PM IST

గోపీచంద్ టాలీవుడ్లో ఉన్న అండర్ రేటెడ్ హీరోల్లో ఒకడు. ఆ కటౌట్ తో బ్లాక్ బస్టర్ కొట్టే ఛాన్స్ లు ఉన్నా ఏ దర్శకుడు కూడా ఆ ఛాన్స్ ను ఉపయోగించుకోవడం లేదు. అలా అని గోపీచంద్ కూడా స్టార్ డైరెక్టర్లతో ఎక్కువ పని చేసింది లేదు. ఇతని కెరీర్లో 30 సినిమాలు చేస్తే అందులో పూరితో చేసిన ‘గోలీమార్’, కృష్ణవంశీతో చేసిన ‘మొగుడు’, బి.గోపాల్ తో చేసిన ‘ఆరడుగుల బుల్లెట్’.. వంటి సినిమాలు మాత్రమే స్టార్ డైరెక్టర్లతో చేసినవి అని చెప్పాలి. ఈ సినిమాలైనా సక్సెస్ అయ్యాయా అంటే అదీ లేదు.’గోలీమార్’ యావరేజ్ గా ఆడింది.. మిగిలిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. గోపీచంద్ ఓ పెద్ద హిట్ కొట్టిన తర్వాత… నెక్స్ట్ సినిమాకి కొంచెం పెద్ద దర్శకుడిని ఎంపిక చేసుకోకుండా కొత్త దర్శకులనో లేదా ఫామ్లో లేని దర్శకులనో ఎంపిక చేసుకుంటాడు. అందుకే ఇతను స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు. పైగా మార్కెట్ కూడా పడిపోయింది. అయితే గోపీచంద్ ప్లాప్ సినిమాల్లో కొన్ని మంచి సినిమాలు కూడా ఉన్నాయి. అందులో ‘ఒక్కడున్నాడు’ కూడా ఒకటి. ఈ సినిమా ఓ అండర్రేటెడ్ మూవీ. ఈ సినిమాకి కల్ట్ ఫాన్స్ కూడా ఉన్నారు.

నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 16 ఏళ్ళు పూర్తి కావస్తోంది.’క్లాప్ ఎంటర్టైన్మెంట్స్’ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చెర్రీ నిర్మించిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకుడు.2007 వ సంవత్సరం మార్చి 3న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో ‘ఒక్కడున్నాడు’ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి… మొదట ఓ చిన్న లైన్ అనుకున్నారు. ‘విలన్ ఒక డాన్. అతనికి గుండె జబ్బు. ఈ నేపథ్యంలో అతనికి తన బ్లడ్ గ్రూప్ తో ఉండే గుండె కావాలి. అలాంటి గుండె ఇండియా మొత్తంలో హీరో ఒక్కడికి మాత్రమే ఉంటుంది. అతని గురించి విలన్ కు తెలిసిన తర్వాత.. అతను హీరో గుండె కోసం ఎలాంటి దారుణాలకు పాల్పడతాడు’ అనేది యేలేటి మొదట అనుకున్న పాయింట్.

2) మొదట ఈ చిత్రాన్ని చిన్న హీరోతో తీయాలి అనుకున్నాడు. అందుకు ముందుగా ఓ హీరోని అనుకోవడం.. ప్రీ ప్రొడక్షన్ టైంలో తాను అనుకున్న క్వాలిటీ రావాలి అంటే ఇంకాస్త బడ్జెట్ సినిమాకి పెట్టాలి అనే థాట్ అతనికి రావడం జరిగింది. చిన్న హీరోకి నిర్మాత అంత బడ్జెట్ పెట్టలేడు. అందుకే గోపీచంద్ ను ఎంపిక చేసుకున్నాడు.

3) గోపీచంద్ ‘ఒక్కడున్నాడు’ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోకి కొంత బ్యాక్ స్టోరీని క్రియేట్ చేశాడు. హీరోకి ఓ ఫ్యామిలీని పెట్టి.. వాళ్ళు బ్యాంక్ స్కామ్ లో ఇరుక్కున్నట్టు.. దీంతో హీరో ముంబై వచ్చినట్టు కమర్షియల్ హంగులు అద్దారు.

4) ‘ఒక్కడున్నాడు’ కథ విషయంలో కొంత కాంట్రవర్సీ కూడా అయ్యింది. కానీ డైరెక్టర్ పెద్దోడు కాదు నిర్మాత కూడా పెద్దోడు కాదు కాబట్టి.. అది తొందరగానే సాల్వ్ అయిపోయింది.

5) ‘ఒక్కడున్నాడు’ చిత్రానికి ఇప్పటి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైలాగులు రాశారు. ఆ విషయం అతి తక్కువ మందికి మాత్రమే తెలిసుండొచ్చు.

6) అంతేకాదు ‘సీతా రామం’ దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రానికి అసిస్టెంట్ గా పనిచేశారట.

7) చంద్ర శేఖర్ యేలేటి కి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే.. అతను మేకింగ్ దశకు వెళ్ళినప్పుడు అనుకున్న బడ్జెట్ కు మించి ఖర్చు చేయిస్తాడు. ‘ఒక్కడున్నాడు’ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. మొదట ఈ చిత్రానికి అనుకున్న బడ్జెట్ కంటే 40 శాతం ఎక్కువ ఖర్చు చేయించాడు.

8) ఈ సినిమాలో ‘మనకక్కర్లేదు అసలక్కర్లేదు’ అనే పాటకు అలాగే ‘అబ్బో వాడేంటో’ అనే పాటకు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కొరియోగ్రఫీ అందించారు.

9) ఇక విడుదల కూడా పలుసార్లు వాయిదా పడుతూ చివరికి 2007 లో మార్చి 3న రిలీజ్ అయ్యింది. ఇంటర్ ఎగ్జామ్స్ తర్వాత టెన్త్ ఎగ్జామ్స్ వల్ల జనాలు ఈ సినిమాని పట్టించుకోలేదు.

10) దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ 80 శాతం రికవరీ మాత్రమే సాధించి యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. అయితే ఇప్పటికీ ఈ మూవీ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఆరోజుల్లోనే ఈ మూవీని హిందీలో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కుదర్లేదు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus