Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మాజీ భార్య నందిని గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి చిన తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. అటు తర్వాత తన సొంత టాలెంట్ తో వరుస సక్సెస్ లు అందుకుని స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నాడు. హీరో అంటే ఇలాగే ఉండాలి అనే పరిమితుల్ని ఇతను చెరిపేసి సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించాడు. స్టార్ హీరోకి సరికొత్త డెఫినిషన్ చెప్పింది పవన్ కళ్యాణ్ అనడంలో అతిశయోక్తి లేదు. అందుకే అతనికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఇదిలా ఉండగా..

పవన్ కళ్యాణ్ 2014 లో ఎవ్వరూ ఊహించని విధంగా జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం తన పార్టీని బలోపేతం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా.. ప్రత్యర్థి పార్టీల నేతలు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ల టాపిక్ ను ఎక్కువ సార్లు తమ ప్రసంగాలలో పెడుతూ పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారు.

ఈ విషయం పై ఇటీవల అన్ స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘నేను జీవితంలో పెళ్లే చేసుకోకూడదు అనుకున్నాను… కానీ మూడు సార్లు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఒకేసారి 3 పెళ్లిళ్లు చేసుకోలేదు. 3 సార్లు పెళ్లి చేసుకున్నాను. భిన్నాభిప్రాయాల కారణంగా రెండు సార్లు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అని పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి 1997 లో నందిని అనే అమ్మాయితో జరిగింది.

అయితే కొన్ని కారణాల వల్ల 2007 లో వీళ్ళు విడాకులు తీసుకున్నారు. తర్వాత రేణు దేశాయ్ తో కొన్నాళ్ల పాటు సహజీవనం చేసి 2009 లో ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక 2012 లో రేణు దేశాయ్ తో విడాకులు తీసుకుని 2013 లో రష్యన్ యువతి అన్నా లెజినోవాని వివాహం చేసుకున్నారు. రేణు దేశాయ్, అన్నా లెజినోవా ప్రస్తుతం ఎలా ఉన్నారో అందరికీ తెలుసు. మరి పవన్ మొదటి భార్య నందిని ఎక్కడుంది..

ఏం చేస్తుంది? అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. 2007 లో పవన్ నుండి విడాకులు తీసుకున్న నందిని.. తర్వాత ఆమె పేరును జాహ్నవిగా మార్చుకుంది. 2010 లో కృష్ణారెడ్డి అనే ఓ డాక్టర్ ను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం తన భర్త పిల్లలతో కలిసి అక్కడ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus