‘ఖుషీ’ వంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తరువాత 5 ప్లాపులను చవి చూసాడు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ కు హిట్టు రాదా.. ఇక అతని పని అయిపోయిందా అని కామెంట్లు చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. అలాంటి నేపథ్యంలో.. 2008వ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీన విడుదలైన ‘జల్సా’ చిత్రం సూపర్ హిట్ అయ్యి.. అలాంటి కామెంట్లకు బ్రేక్ వేసింది.చెప్పాలంటే ఇది పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గ సినిమా ఏమీ కాదు. మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ చేసిన మూవీ అసలే కాదు.సంజయ్ సాహు అనే కుర్రాడు జీవితంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులను తెలిపే చిన్న కథ ఇది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘గీత ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించాడు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలు అప్పట్లో ఓ ఊపు ఊపేశాయనే చెప్పాలి. అప్పటికి పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యథిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది ‘జల్సా’. అంతేకాదు ఈ సినిమా అప్పటికి 7 అరుదైన రికార్డులను కూడా నమోదు చేసింది. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
1) ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చెయ్యడం అనే ట్రెండ్ ‘జల్సా’ నుండే మొదలయ్యింది.
2)ఆడియో రిలీజ్ కు ముందే ‘జల్సా’ నుండీ 3 సాంగ్స్ ఇంటర్నెట్లో లీక్ అవ్వడం.. అవి కూడా చార్ట్ బస్టర్స్ అవ్వడం జరిగింది.
3)ఆడియో సిడిల ద్వారా కోటి రూపాయలు కలెక్ట్ చేసిన ఏకైక చిత్రంగా ‘జల్సా’ రికార్డు సృష్టించింది.
4)నైజాం లో 9.10కోట్ల షేర్ ను నమోదు చేసిన మొట్టమొదటి చిత్రం ‘జల్సా’.
5) ఒక సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి పాసులు ఇచ్చి ఫ్యాన్స్ కు సీట్లు ఏర్పాటు చెయ్యడం కూడా ‘జల్సా’ నుండే మొదలయ్యింది.
6) 12 ఏళ్ళ తరువాత బాలీవుడ్ స్టార్ ర్యాప్ సింగర్ అయిన బాబా సెహగల్ ను టాలీవుడ్ కు తీసుకువచ్చిన సినిమా ఇది. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘రిక్షావోడు’ సినిమాలో ‘రూపు తేరా మస్తానా’ పాట పాడాడు బాబా.
7) ‘గాల్లో తేలినట్టుందే’ అనే ఒక్క పాట కోసం 1 కోటి రూపాయల ఖర్చుతో సెట్ ను వేశారు. అప్పట్లో ఇదొక సెన్సేషన్.
8)వరల్డ్ వైడ్ గా 1000 స్క్రీన్లలో రిలీజ్ అయిన మొట్టమొదటి తెలుగు సినిమా ‘జల్సా’.
9) ఒక స్టార్ హీరో అయిన పవన్ కళ్యాణ్ సినిమాకి మరో స్టార్ హీరో అయిన మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం.. మొట్టమొదటిగా ‘జల్సా’ మూవీకే జరిగింది.
10) 282 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది ‘జల్సా’ మూవీ. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదొక రికార్డు.
11) ప్రసాద్స్ లో రూ.85 లక్షలు కలెక్ట్ చేసిన మొట్టమొదటి చిత్రం ‘జల్సా’.
12) ఓవర్సీస్ లో 4కోట్ల పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసిన మొదటి చిత్రం ‘జల్సా’.